Jana Sena: ఏపీలో నానుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో అక్కడ విడతల వారీగా స్థానికల సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను అందుకున్న నేపథ్యంలో స్థానికసంస్థల ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ,బీజేపీ, జనసేన నాయకులు స్థానిక కార్యవర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ కూటమి పార్టీలలో సీట్ల సర్దుబాటు కాస్త చర్చకు దారి తీస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. 80;15;5 ఫార్ములాలో సీట్ల కేటాయింపు జరపాలని సూచనలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీడీపీకి 80శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు కేటాయిస్తారని వార్తలువస్తున్నాయి. దీంతో కూటమిలో అలజడి మొదలయింది. ఈ విధానాన్ని జనసేన వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన సరికాదని ఏపీ మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు సమాచారం. 2024లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని ఆయన చెబుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో నాడు గెలుపు కోసం జనసేన ఒక అడగు వెనక్కి తగ్గిందని, అప్పటి పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదని నాందెడ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలకు నాటి నిర్ణయం వర్తించదని ఆయన చెబుతున్నారు. మనోహర్ చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ నిర్ణయం అయి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఆధారంగా సీట్లు అడుగుతున్నామని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.
నామినేటెడ్ పోస్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా జనసేన ప్రధానం ప్రస్తావిస్తోంది. బీజేపీనాయకులు కూడా జనసేన తో స్వరం కలుపుతున్నారు.ఈనేపథ్యంలో టీడీపీ తీసుకునే నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికల మాదిరిగా వ్యవహరిస్తే కూటమి విచ్చిన్నం కావడం ఖాయం. అదేజరిగితే వైసీపీకి ఆయాచిత వరం లభించినట్టే. అది జరగకూడదు అనుకుంటే భేషజాలకు పోకుండా మూడుపార్టీలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి.సీట్ల సర్దుబాటు పకడ్బందీగా చేయాలి. స్థానికసంస్థలలో బలం పెంచుకోకపోతే..2029 ఎన్నికల్లో కూటమికి ఇబ్బందులు తప్పవు.
డెవలప్మెంట్, సంక్షేమాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోతే ఉపయోగం ఉండదు. పైగా ఏపీలో కులాలు, మతాలు వంటి వ్యవహారాలు ఉంటాయి. అందువల్లే వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి పకడ్బందీగా వ్యవహరించాలి. సీట్లకేటాయింపు, పంపకంవంటి వ్యవహారాలలో సమతూకాన్ని పాటించాలి. ఇందులో ఏ పార్టీ కాస్త నారాజ్ పడినా ఇబ్బందితప్పదు. ముఖ్యంగా టీడీపీ తననాయకులను అదుపులో ఉంచుకోవాలి. బీజేపీ, జనసేన నాయకులకు గౌవరం ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి కొనసాగించాలని చెప్పాలి. ఇటీవల చంద్రబాబు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అయినప్పటికీ కొందరి వ్యవహార శైలి మారడం లేదు. అలాంటి వాళ్లపట్ల చంద్రబాబు కఠినంగా ఉంటేనే మంచిది. అలాంటి వారి వల్ల మొత్తం కూటమికే చెడ్డ పేరు వస్తుంది.
