Homeఆంధ్రప్రదేశ్‌AP Governor health update: ఏపీ గవర్నర్ కు సడెన్ గా ఏమైంది... ఆ డాక్టర్లు...

AP Governor health update: ఏపీ గవర్నర్ కు సడెన్ గా ఏమైంది… ఆ డాక్టర్లు ఎందుకలా చెప్పారు..

AP Governor health update: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్( Andhra Pradesh governor Syed Abdul Nazeer ) అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పికి గురికావడంతో ఆయనను విజయవాడలోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతుంది. బెంగళూరు వెళ్ళిన ఆయన అర్ధరాత్రి సమయం లో విజయవాడ చేరుకున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు కడుపునొప్పి బారిన పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని.. రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఆలస్యంగా చేరడంతో..
విజయవాడ( Vijayawada) నుంచి బెంగళూరు వెళ్లారు గవర్నర్ అబ్దుల్ నజీర్. నిన్న సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన ప్రయాణించే విమానం ఆలస్యం అయ్యింది. అర్ధరాత్రి రెండు గంటలకు ఆయన విజయవాడ చేరుకున్నారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స అందించడంతో కోలుకున్నారు. వెంటనే విజయవాడ వెళ్ళిపోయారు. గవర్నర్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను డాక్టర్లు తొలగించాలని సూచించారు. అయితే ఈరోజు ముఖ్యమైన పనులు ఉండడంతో మరోసారి వచ్చేందుకు గవర్నర్ డాక్టర్ల అనుమతి తీసుకున్నారు. మరోసారి వస్తానని చెప్పి ఆసుపత్రి నుంచి వెళ్లారు. గవర్నర్కు అస్వస్థత అని తెలియడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. స్వల్ప అస్వస్థత కావడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో కూడా అస్వస్థత..
గవర్నర్ అబ్దుల్ నజీర్ గతంలో కూడా కడుపునొప్పికి గురై మణిపాల్ ఆసుపత్రిలో( Manipal Hospital) చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన అపెండిసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో గవర్నర్కు రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ నిర్వహించారు. 2024లో మరోసారి అస్వస్థతకు గురికావడంతో అప్పట్లో ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరోసారి ఇప్పుడు కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. త్వరలో ఆయనకు సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular