Vidya Shakti Scheme : ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వారికోసం విద్యా శక్తి పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించనుంది. అదనంగా వారికి ఆన్లైన్ వాదన అందించండి. స్కూల్ తో పాటు కాలేజీ సమయం పూర్తయిన తరువాత అదనంగా గంటపాటు మద్రాస్ ఐఐటీఎం వారితో తరగతులు నిర్వహించడానికి నిశ్చయించింది ప్రభుత్వం. ఇప్పటికే మద్రాస్ ఐఐటీ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. ముందుగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కేవలం వెనుకబడిన విద్యార్థుల పైనే ఫుల్ ఫోకస్ పెట్టి.. వారికి ఆన్లైన్ విద్యాబాధన అందించనున్నారు.
* మంత్రి లోకేష్ చొరవ
ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు నేర్పిస్తారు. ఐఐటి మద్రాస్ లోని ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో ఈ ఆన్ లైన్ బోధన జరగనుంది. అయితే పైలట్ ప్రాజెక్టులుగా అనంతపురం తో పాటు గుంటూరు జిల్లాలను ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం. అక్కడ పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే.. వచ్చే జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో మిగతా ప్రాంతాల్లో విస్తరించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఆ రెండు జిల్లాల్లో ఆరు నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ ఆన్లైన్ భాదన జరుగుతోంది.
* ఆన్ లైన్ బోధన
విద్యా శక్తి పథకం పేరుతో ఆన్ లైన్ బోధనను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు, కాలేజీల సమయం పూర్తయిన తర్వాత చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు.. గంటపాటు జూమ్ ద్వారా ఆన్లైన్ పాటలు బోధిస్తారు. అయితే పదో తరగతికి మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. వారికి పాఠశాలల్లోనే అదనపు తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యా శక్తి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆన్లైన్ బోధనకు సంబంధించి ప్రతి శనివారం విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నారు. వారం మొత్తంలో జరిగిన తరగతులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఫలితాలు ఆధారంగా విద్యార్థుల పురోగతిని స్కూలు యాజమాన్యం అంచనా వేస్తోంది. మొత్తానికి అయితే క్రమేపి పాఠశాల విద్యాశాఖ పై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం.
* ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం
వచ్చే విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. వైసీపీ సర్కార్ అప్పట్లో చాలా పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేసింది. దీంతో గ్రామాల్లో పాఠశాలల భవనాలు వృధాగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ నియామకం పూర్తి కావడంతో.. ఇలా విలీనం చేసిన పాఠశాలలను సైతం వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. అదే జరిగితే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వచ్చినట్టే.