VLT Reduction: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ స్థలాలపై విధించే విఎల్టి( vacant land tax) ను 50% తగ్గించింది. నిర్మాణ కాలంలో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాయితీ చట్టబద్ధంగా భవన నిర్మాణ అనుమతి పొందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలు, అనధికారిక నిర్మాణాలకు ఈ రాయితీ వర్తించే అవకాశం ఉండదు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల నుంచి అనుమతి తీసుకున్న అన్ని నిర్మాణాలకు ఈ 50% తగ్గింపు అనేది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా రూ.30 కోట్ల వరకు ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మున్సిపాలిటీ తో పాటు నగరాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటారు. కానీ నిర్మాణ సమయంలో మళ్లీ వీఎల్టి వసూలు చేయడంతో ప్రజలపై భారం పడుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* ఇంటితోపాటు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన రోజు నుంచి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే వరకు పనులు తగ్గింపు వర్తిస్తుంది. అనుమతి తీసుకున్నప్పటినుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు.. అనుమతుల గడువు ముగిసిన, పొడిగించిన.. గడువు ముగిసే వరకు ఈ వర్తింపు ఉంటుంది.
* ఎవరైనా అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే వారికి పన్ను తగ్గింపు వర్తించదు. ఈ పన్ను తగ్గింపునకు అవసరమైన చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
* వి ఎల్ టి ద్వారా ప్రభుత్వానికి ఏటా 60 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు 50 శాతం తగ్గించడంతో 30 కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుంది.
* 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లోనే 50 శాతం తగ్గింపునకు నిర్ణయించింది. వైసిపి వచ్చిన తర్వాత ఈ జీవోను అమలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.