Endowment assistant commissioner: మరోసారి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేయడం విశేషం. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ.. శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2016 లోనే మదన్ మోహన్ నుంచి విడాకులు తీసుకున్నట్లు శాంతి చెప్పుకొచ్చారు. కానీ 2023 వరకు దేవాదాయ శాఖ పరంగా పొందుపరిచిన వివరాల్లో.. భర్త మదన్ మోహన్ అంటూ ఆమె పేర్కొనడం విశేషం. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించారు. దీంతో మరోసారి శాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
* కొత్తగా అభియోగాలు
తాను మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చానని.. సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని శాంతి చెబుతోంది. కానీ దేవాదాయ శాఖ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె భర్త పేరును కె.మదన్ మోహన్ గా పేర్కొంది. సర్వీసు రిజిస్టర్ లో కూడా అదేపేరు నమోదు చేశారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా.. భర్త పేరును మదన్ మోహన్ గా పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన భర్త సుభాష్ అని చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే శాంతి పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను ఈనెల 2న సస్పెండ్ చేశారు. తొమ్మిది రకాల అభియోగాలు మోపారు. ఇప్పుడు కొత్తగా మరో ఆరు అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేశారు.
* 15 రోజుల్లో సమాధానం చెప్పాల్సిందే
ఆమె తన భర్త విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఆమెకు ఎదురైంది. అసలు విడాకులు తీసుకున్నారా? లేకుంటే విడాకులు తీసుకున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారా? తేలాల్సిన అంశం ఇదే. 2016లో విడాకుల అగ్రిమెంట్ చేసుకుంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకుంటే.. దేవాదాయ శాఖ రిజిస్టర్ లో మదన్ మోహన్ పేరును ఎందుకు రాసినట్టు? ఇప్పుడు ఇదే కీలకంగా మారనుంది. విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి.. వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఇది దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు విలేకరుల సమావేశం నిర్వహించేటప్పుడు.. శాఖాపరమైన అనుమతి తీసుకోలేదు.
* విజయసాయి రెడ్డి ట్విట్ కి సమాధానం
ఇంకోవైపు విజయసాయిరెడ్డి తో తనకు సంబంధం లేదని శాంతి చెప్పుకొచ్చారు. ఆయనతో సంబంధాలు అంటగట్టడంపై కన్నీటి పర్యంతం అయ్యారు. అటు విజయసాయిరెడ్డి సైతం దీనిపై స్పందించారు. తనకు శాంతితో ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు. మీడియాపై చిందులు వేశారు. పలువురు జర్నలిస్టులు, మీడియా అధిపతుల కుట్రగా అభివర్ణించారు. కానీ తాజాగా దేవాదాయ శాఖ అభియోగాల్లో.. విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం.’ ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్. మీరు పార్టీకి వెన్నెముక’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న శాంతి ట్విట్ చేశారు. ఇది ఆ పార్టీతో శాంతికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని.. ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో మోపారు దేవాదాయశాఖ కమిషనర్. విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో షాపుల అనుమతులు, లీజుల వ్యవహారంలో సైతం అడ్డగోలుగా వ్యవహరించారని దేవాదాయ శాఖ విచారణలో తేలింది. మరోవైపు ఆమె దురసుగా ప్రవర్తించిన ప్రైవేటు కేసులకు సంబంధించి కూడా అభియోగాలు మోపుతూ నోటీసులు ఇచ్చారు. మొత్తానికైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap government notices to assistant commissioner shanti of revenue department
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com