AP Government: ఏపీ ప్రభుత్వం( AP government ) వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం కార్డులు జారీచేస్తోంది. 60 సంవత్సరాలు దాటిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలకు ఈ కార్డులు అందిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు సర్వీస్కు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయించింది. అంటే ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండానే కార్డు జారీచేస్తోంది. సీనియర్ సిటిజన్ కార్డు కోసం గతంలో 40 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఇకనుంచి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ కార్డులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన సీనియర్ సిటిజెన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
* ఎన్నో ప్రయోజనాలు..
సీనియర్ సిటిజన్ కార్డులతో( senior citizen cards ) ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సేవలను సులువుగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవచ్చు. ఆర్టీసీ బస్సు టికెట్ పై 25% రాయితీ, బ్యాంకు సేవలు, పన్ను మినహాయింపు, ఇతర సేవల్లో సైతం ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా వారికి ఆరోగ్య భరోసా దక్కనుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వారికి ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తారు. ఈ పథకం కింద కార్డు ఉంటే ఏడాదికి ఐదు లక్షల వరకు వైద్య సహాయం కూడా పొందవచ్చు.
* వెబ్సైట్ పనిచేయక ఇక్కట్లు..
కానీ ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కార్డుల జారీలో ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కుదరడం లేదని ఎక్కువ మంది చెబుతున్నారు. ఇటీవల ఈ వెబ్సైట్( website ) పనిచేయడం లేదని తెలుస్తోంది. సచివాలయాలతో పాటు మీసేవ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తొలగిపోతాయని.. అవి పరిష్కారమైన వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. అదే సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నారు. ఈ కార్డు కోసం వయసు ధ్రువీకరణ పత్రంతో పాటుగా ఫోటో, బ్లడ్ గ్రూప్, ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కార్డులు జారీ చేస్తారు.