AP Government : తాజాగా ప్రభుత్వం మహిళలకు ఊరట కలిగించే వార్త తెలిపింది. దీనివలన చాలామంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. మరో రెండు మూడు రోజులలో మహిళలకు రుణ మంజూరు కానుంది. ఆ తర్వాత మహిళల అకౌంట్లో డబ్బులు కూడా జమ కానున్నాయి. తాజాగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టి మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతి స్కీంను అమలు చేస్తుంది. ఈ సీంలో అర్హులైన మహిళలకు ప్రభుత్వం రుణాలు అందిస్తుంది. అయితే గత ఆర్థిక సంవత్సర లక్ష్యాలను జనవరి నెల నాటికి పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాల ను దృష్టిలో పెట్టుకొని మహిళలకు సహకారం అందించే విధంగా అడుగులు వేస్తుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు గరిష్టంగా రూ.3 లక్షలు ప్రభుత్వం రుణం మంజూరు చేస్తుంది. కనిష్టంగా రూ.50 వేలు రుణం పొందవచ్చు.
మహిళలు టైలరింగ్ యూనిట్, ట్రాక్టర్ కొనుగోలు, హోటల్ ఏర్పాటు చేసుకోవడానికి, దుకాణాలు అలాగే పాడి పరిశ్రమలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఉన్నతి స్కీం కింద అర్హులైన మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. ఉన్నతి స్కీం కింద ప్రభుత్వం ఈ ఏడాది రూ. 9.19 కోట్ల రుణాన్ని విజయనగరం జిల్లాలో మంజూరు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఈ ఏడాది దాదాపు రూ.1800 మందికి పైగా ప్రయోజనం పొందుతారు. అర్హత కలిగిన మహిళలు వెంటనే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి వెలుగు శాఖలో సంప్రదించవచ్చు.
ఉన్నతి స్కీమ్ గురించి విజయనగరం జిల్లా డిఆర్డిఏ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 మూడు లక్షల వరకు అర్హులైన మహిళలకు రుణం మంజూరు చేస్తారని తెలిపారు. దీని ద్వారా వాళ్లు ఆటోలు, టాటా ఏసీ వంటి వాహనాలను కూడా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. మండలాల వారిగా లక్ష్యాలు నిర్దేశించి రుణ మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. మరో రెండు మూడు రోజులలో అర్హులైన వాళ్లకు రుణం మంజూరు అవుతుందని తెలిపారు. ఇది ఇలా ఉంటే విజయనగరం జిల్లాలో ఉన్న తిరుణాల వసూళ్లలో కొంత అలసత్వం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఈ పథకం కింద గత ఏడాది రూ.13.9 కోట్ల రుణాలను ప్రభుత్వ మంజూరు చేస్తే వస్తువులు మాత్రం రూ.10 కోట్ల వరకే వచ్చాయని తెలుస్తుంది.