AP government : PMJAY వయో వందన పథకం కింద 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఐదు లక్షలు ఉచిత వైద్యం ప్రభుత్వం అందించబోతుంది. అలాగే రాష్ట్రంలో దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డులను కూడా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కి ఒక శుభవార్త తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు అలాగే PMJAY వందన వయో వృద్ధుల పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దివ్యాంగులకు అలాగే వయోవృద్ధుల సంక్షేమం కు సంబంధించి ఇటీవలే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
Also Read : ఇకపై ఏపీలో మహిళలు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటి నుంచో తెలుసా..
ఈ సమావేశంలో మంత్రి అధికారులతో సదరం సర్టిఫికెట్లు అలాగే PMJAY వయోవందన హెల్త్ పథకం గురించి చర్చించారు. ఆయన అధికారులతో గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలలో అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సదరం స్లాట్ బుకింగ్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అనరులైన వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా PMJAY వయో వందన పథకం కింద ఒక్కొక్కరికి ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి సామాజిక మరియు ఆర్థిక నిబంధనలు కూడా లేవని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఈ పథకానికి అర్హులు అని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏపీ రాష్ట్రమంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి యు డి ఐ డి కార్డుల మంజూరుకు సంబంధించి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్స్ అలాగే దివ్యాంగులు గ్రామ సచివాలయాలు లేదా మీ సేవ కేంద్రాలు లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యు డి ఐ డి పోర్టల్ ను సదరం పోర్టల్ కు అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలో వాళ్లకు సర్టిఫికెట్లు వచ్చేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు.