Ambati Rambabu Viral Video: ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ముందుంటారు మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu). ఆయన వ్యవహార శైలి పై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. తాజాగా తొందరపాటుతో అడ్డంగా బుక్కయ్యారు. ఒక వీడియోను పోస్ట్ చేసి లేనిపోని కష్టాలను తెచ్చుకున్నారు. ఆయనపై చర్యలు తప్ప ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ననే పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు పోయా ప్రవీణ్ ఐపిఎస్ కి అంకితం అంటూ పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
రెండేళ్ల కిందట నాటి వీడియో..
అయితే అంబటి రాంబాబు చేసిన పోస్టును వైసిపి( YSR Congress party) శ్రేణులు విపరీతంగా వైరల్ చేశాయి. అయితే ఆ వీడియో ఫేక్ అని తేలింది. పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్ల పై ఓట్లు వేసి.. వాటిని బాక్సులో వేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో వాడిన బ్యాలెట్ పేపర్ల రంగులో ఉన్నవి అవి కావు. దీంతో అంబటి రాంబాబు పై సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభం అయ్యాయి. గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అది పాత వీడియో అని.. రెండేళ్ల కిందట వైరల్ అయిన వీడియోను తెచ్చి.. పోస్ట్ చేయడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు. రాజకీయ ఆరోపణలు చేయాలే కానీ.. మరి ఇంతటి దిగజారుడు తనమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఫేక్ అని తేల్చిన ఫ్యాక్ట్ చెక్ టీం
మరోవైపు అంబటి రాంబాబు ట్వీట్ చేసిన వీడియో పై ఆంధ్ర ప్రదేశ్ ఫాక్ట్ చెక్ టీం( AP fact check team ) స్పందించింది. పోలీసుల దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని అర్థం వచ్చేలా అంబటి రాంబాబు పోస్ట్ పెట్టారు. అయితే ఇది 2023 జూలైలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వీడియో. దీన్ని అప్పట్లోనే సుదాంసువేది అనే లాప్టాప్ పోస్ట్ చేశారు. అదే వీడియోను ఇప్పుడు అంబటి రాంబాబు పోస్ట్ చేయడం.. ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్ర పూరిత ఆరోపణలు చేయడం… ప్రజలను తప్పుదోవ పట్టించడం కింద వస్తుంది. ప్రజలు దీనిని ఫేక్ గా గుర్తించాలి. అంటూ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. అవసరం అనుకుంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారని చెప్పుకొచ్చింది. అది పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అంటూ స్పష్టతనిచ్చింది.
పార్టీకి తలవొంపులు
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల( pulivendula) ఉప ఎన్నికకు సంబంధించి సరైన రీతిలో ముందుకెళ్లలేదు. ఎంతవరకు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందని ఆరోపణ తప్పించి.. దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోతోంది. అయితే డిపాజిట్ కోల్పోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశం. అధినేత జగన్ నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకు అధికార పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని ఆరోపిస్తున్నారు. కానీ అంబటి లాంటి నేత పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పార్టీ పరువును మరోసారి గంగలో కలిపారని క్యాడర్ బాధపడుతోంది. అసలే బాధ మీద ఉన్న పార్టీకి అంబటి రాంబాబు చర్యలు తలవొంపులు తెచ్చే పనిలా ఉన్నాయి.
ఈ ZPTC ఎన్నికల ఫలితాలు
కోయ ప్రవీణ్ IPS కి అంకింతం ! pic.twitter.com/vU4dptyZOH— Ambati Rambabu (@AmbatiRambabu) August 14, 2025