Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. పదేళ్ల కిందట ఆయన కొన్ని షరతులతో బెయిల్ కూడా పొందారు. ఇప్పుడు మరోసారి కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రధానంగా ఓ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ హైదరాబాదులోని సిబిఐ కోర్టును ఆశ్రయించారు జగన్. ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈనెల 11 నుంచి 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు జగన్. భార్య భారతి తో కలిసి లండన్ వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అక్కడ కుమార్తెను కలవబోతున్నారు. గతంలో విదేశీ పర్యటనకు సంబంధించి న్యాయస్థానం చాలా రకాల షరతులను విధించింది. ఇప్పుడు వాటిని సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది. సిబిఐ తీసుకునే నిర్ణయం పై జగన్ విదేశీ పర్యటన ఆధారపడి ఉంది.
* తండ్రి అకాల మరణంతో
2009లో కడప ఎంపీగా ఎన్నికయ్యారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా ఎంట్రీ ఇచ్చారు జగన్. అంతకుముందే ఆయన పారిశ్రామికవేత్తగా కొనసాగారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. 2009లో ఇవేవీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా అవకాశం ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. అయితే తండ్రి ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకు కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి మరి భరోసా యాత్ర చేపట్టారు జగన్. కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావడంతో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేశారన్న ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు ఆయనపై సిబిఐ విచారణలో కొనసాగాయి. 2019లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఈ విచారణలు నిలిచిపోయాయి.
* కోర్టుకు ప్రత్యేక వినతి
ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు జగన్. అందుకే గతంలో ముఖ్యమంత్రి హోదాలో తన కేసుల విషయంలో ఉన్న మినహాయింపులు తొలగించబడ్డాయి. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ తరుణంలో లండన్ లో చదువుకుంటున్న కుమార్తెను కలిసేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయనతో పాటు మరో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి సైతం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో కోర్టు బెయిల్ షరతులను సడలిస్తుందా? లేక అదే నిబంధనలు కొనసాగిస్తుందా? అన్నది చూడాలి. అయితే వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap former cm jagan once again approached the high court
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com