AP Elections 2024: చంద్రబాబుకు వయసు మల్లుతోంది. అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఏడుపదుల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా ఆయన గడుపుతున్నారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నారు. అయితే ఆయన వయోభారం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో పవన్ తో పాటు వేదికలు పంచుకుంటున్నారు. ఈ తరుణంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం లో చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పవన్ జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అటు చంద్రబాబు ప్రజాగళం సభల్లో సైతం పాల్గొంటున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ లోకం కళ్యాణి పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా చంద్రబాబుతో పాటు పవన్ ప్రచారం చేశారు.చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నెత్తిన రూపాయి పెడితే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ నోరు జారారు. జగన్ పై విమర్శలు చేసే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు చంద్రబాబు కరెంటు కోతలపై మాట్లాడేటప్పుడు సభికుల నుంచి లేవు అంటూ సమాధానం రావడం విశేషం.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల వ్యాఖ్యలు ఇలా మాట తప్పుతున్నాయి. చాలామంది నేతలు పొరపాటున నోరు జారుతున్నారు. అయితే ఇవి ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియాకు అస్త్రంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ఏ చిన్న పొరపాటు జరిగినా అది అంతిమంగా ప్రత్యర్థికి వరంగా మారుతుంది. కాగా చంద్రబాబు నెల్లిమర్ల సభలో జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను బొత్స కుటుంబంతో పాటు విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి వంతులు వేసుకుని మరీ దోచుకున్నారని ఆరోపించారు. అందుకే రాజధాని అంటూ ఆరాటపడుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు పవన్ సైతం తనదైన శైలిలో వైసిపి ప్రభుత్వంతో పాటు జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయితే సభ అసాంతం బాగానే జరిగిన చంద్రబాబు టంగ్ స్లిప్ అయ్యారు. పవన్ ముందే పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. సోషల్ మీడియాకు అడ్డంగా బుక్కయ్యారు.
పవన్కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన చంద్రబాబు
నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే.. పైసాకి కూడా అమ్ముడుపోని వ్యక్తి పవన్ కళ్యాణ్ – చంద్రబాబు pic.twitter.com/VnHQa7xj3i
— Amar Amar (@amarballa2) April 24, 2024