Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదన్నారు… కానీ తను వేసిన స్కెచ్ ఏంటో తెలిస్తే నోరెళ్ళబెడతారు…

Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఈ గేమ్ లో తను గేమ్ చేంజర్ గా మిగిలిపోవడమే కాకుండా కొద్దిరోజుల్లోనే జగన్ కేసుల విషయాలను కూడా పరిశీలించి తనకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నాడు...

Written By: Gopi, Updated On : June 4, 2024 9:51 pm

Jagan vs Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : ఏపీ ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట తన అభ్యర్థులను గెలిపించుకొని తన స్టామినా ఎంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇంతకుముందు వైసీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి రాజకీయం చేసేంత నైపుణ్యం లేదు అంటూ విమర్శలైతే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ చతురతతో వార్ వన్ సైడ్ చేసేశాడు. ఇక మొత్తానికైతే వైసీపీని దారుణంగా ఓడించడమే కాకుండా కూటమిని గెలుపు పీఠాలెక్కించాడు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించాడు. ఇక ఈ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి ఈ కూటమిని ఏర్పాటు చేశాడు.

నిజానికి అమిత్ షా చంద్రబాబుతో కలవడానికి అసలు ఇష్టపడలేదట.. ఎందుకంటే 2019 వ సంవత్సరంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బిజెపి ని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలను కూడా చేశాడు. ఇక ఇంకోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదని అమిత్ షా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు ఉంటే వైసీపీ ని గద్దె దించొచ్చనే ఉద్దేశ్యంతోనే అందర్నీ కలిపి ఒక కూటమిని తయారు చేశాడు. ఇక దీనివల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చే ప్రయోజనం కంటే కూడా రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది. నిజానికి ఇంతకుముందు వైసీపీ బిజెపి రెండు పొత్తులో ఉండేవి..

ఇక ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వైసీపీ కి బిజెపి సపోర్టుగా ఉంటుందని పవన్ గ్రహించాడు. దీనివల్ల జగన్ కేసుల విషయంలో బిజెపి మళ్ళీ తనని ఆదుకుంటుందేమోననే ఉద్దేశ్యం తోనే పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశాడు.  జగన్ నుంచి బిజెపి పార్టీని వేరుచేసి తమ కూటమిలో కలిసిపోయేలా చేశాడు. ఇక ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులన్నింటిని బట్టబయలు చేయొచ్చు. అలాగే వీలైతే జగన్ ని మళ్లీ జైలుకు కూడా పంపించొచ్చు అనే ఉద్దేశ్యం తోనే పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టుకున్నాడు.

ఇక జగన్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత  జైల్లో ఉండాల్సిందే అని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యూహా పూరితమైన రాజకీయ ప్రణాళికను రూపొందించాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ గేమ్ లో తను గేమ్ చేంజర్ గా మిగిలిపోవడమే కాకుండా కొద్దిరోజుల్లోనే జగన్ కేసుల విషయాలను కూడా పరిశీలించి తనకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నాడు… ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతో తను సక్సెస్ సాధించాడనే చెప్పాలి…