Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Earthquake: ఏపీలో భూకంపం.. ఎక్కడ నమోదయిందంటే..

Andhra Pradesh Earthquake: ఏపీలో భూకంపం.. ఎక్కడ నమోదయిందంటే..

Andhra Pradesh Earthquake: గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో భూకంపం చోటుచేసుకుంది. స్వల్ప ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మేడారం పరిసర ప్రాంతాలలో వచ్చిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. మేడారం ఆలయంలో భూమి స్వల్పంగా కంపించింది.

ఈ సంఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకు హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాలలో భూకంపం ఏర్పడింది. రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఆ ప్రభావం అపార్ట్మెంట్ల లో నివాసం ఉండే వారి పైన పడింది. చాలా రోజుల వరకు అపార్ట్మెంట్లో ఉండేవారు ఇతర ప్రాంతాలలో నివాసం ఉన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ మీద 3.5 తీవ్రతతో భూకంపం చేసుకుంది. వినుకొండ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో.. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వినుకొండ.. దర్శి ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు.

వచ్చే రోజుల్లో ఈ ప్రాంతం లో మరిన్ని భూ ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూమిలో ఫలకాల మధ్య కదలికలవల్లే భూకంపాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భూమి లో ఫలకాలు మధ్య స్వరూపంగా కదలికలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ స్థాయిలో భూ కంపం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో భూమిలో కదలికలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో గోదావరి పరి వాహక ప్రాంతంలో మాత్రమే భూమిలో కదలికలు చోటు చేసుకునేవి.. ఇప్పుడు మాత్రం మైదాన ప్రాంతాలలో కూడా భూమి అంతర్భాగంలో కదలికలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐతే ఈ కదలికలు ఇప్పటితోనే ఆగిపోతాయా… భవిష్యత్తు కాలంలో ఇంకా ఏమైనా చోటు చేసుకుంటాయా.. అనే ఆందోళన అటు శాస్త్రవేత్త లలోనూ.. ఇటు ప్రజలలోనూ కలుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular