AP DWCRA Women Scheme : ఈ పథకం కింద స్త్రీ నిధి బ్యాంకులో మహిళలకు రూ.10,000 రూపాయల నుంచి రూ.లక్ష రూపాయల వరకు నాలుగు శాతం వడ్డీకి రుణం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు అందరూ కూడా లబ్ధి పొందుతారు అని తెలుస్తుంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడంలో ఈ పథకం చాలా సహాయపడుతుంది. డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త తెలిపింది. వాళ్ల పిల్లల కోసం ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం సెల్ఫ్ ఆధ్వర్యంలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణాలను మంజూరు చేస్తారు. ఎన్టీఆర్ విద్య సంకల్పం గా ఈ పథకానికి పేరు పెట్టాలని అధికారులందరూ ప్రతిపాదించారు. కేజీ నుంచి పీజీ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలలలో అలాగే కళాశాలలలో చదివే విద్యార్థులు అందరూ కూడా ఈ పథకం కింద లబ్ధి పొందుతారు.
Also Read : జిల్లాకు ఒకటి.. ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
అయితే ఈ పథకం నుంచి తీసుకున్నారు రుణాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసమే ఉపయోగించాలి. తీసుకున్న రుణంతో పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, పుస్తకాలు లేదా యూనిఫాంలు వంటివి కొనుగోలు చేయవచ్చు. ఈ రుణాన్ని సాంకేతిక విద్యకు కూడా ఉపయోగించవచ్చు. అలాగే సొంత ఊరి నుంచి దూర పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు ఈ డబ్బులతో సైకిల్ కొనుక్కోవడానికి కూడా అనుమతి ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో దేనికోసం డబ్బులను ఖర్చు చేశారో వాటికి సంబంధించిన రసీదులను స్త్రీ నిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతం వడ్డీకే కొత్త పథకం కింద రుణాలు అందిస్తుంది.
మహిళలు తమ పిల్లల చదువు కోసం స్త్రీ నిధి బ్యాంకు ద్వారా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించడం. పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ డబ్బులతో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. డ్వాక్రా మహిళల పిల్లల కోసం త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద మహిళల పిల్లలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలుస్తుంది.