AP Cabinet Reshuffle : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. జూన్ 4 నాటికి కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. టిడిపి కూటమి సూపర్ విక్టరీ సాధించింది. అయితే అభివృద్ధి పనులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ నెలలోనే రెండు కీలక పథకాలకు శ్రీకారం చుట్టునుంది. అయితే రాజకీయంగా పట్టు పెంచుకునేందుకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఏడాది పాలన సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి పై హామీ ఇచ్చారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే నాగబాబు తో పాటు బిజెపి ఎమ్మెల్యే ఒకరికి క్యాబినెట్లో అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : లోకేష్ ప్రమోషన్ ను అడ్డుకున్నది ఆయనే..
* అప్పట్లో హామీ..
రాజ్యసభ( Rajya Sabha ) పదవుల భర్తీ సమయంలో నాగబాబుకు సర్దుబాటు చేయలేకపోయారు. ఆ సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రకటన చేశారు. మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి ప్రకటించలేదు. ఎప్పుడు అనేది ఇంతవరకు స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మారుతున్న లెక్కలతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొందరి మంత్రుల పనితీరులో మార్పు రాకపోవడంతో వారిని మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
* ఖాళీగా ఉన్న పదవి నాగబాబుకు..
ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. 25 మంది మంత్రులకు గాను 24 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని నాగబాబుతో( Nagababu ) భర్తీ చేస్తారు. అదే సమయంలో బిజెపికి మరో మంత్రి పదవి కేటాయించాలన్న డిమాండ్ వస్తోంది. ఇప్పటికే కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు కేటాయించారు. ఈ లెక్కన ఏపీలో కూడా బిజెపికి మరో మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలు కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు బిజెపికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఒక మంత్రి ఉద్వాసన ఖాయం. అయితే ఒకరినే మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు బాగాలేని ఓ ముగ్గురు నుంచి ఐదుగురు మంత్రులను తొలగిస్తే.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే అనవసరంగా తేనె తుట్టను కదుపుతారా? అన్నది ఒక అనుమానమే.
* పనితీరు బాగా లేకపోవడంతో.. మహానాడు( mahanadu ) విజయవంతంగా పూర్తయింది. టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ముగ్గురు మంత్రులను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వారి పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఇంతకుముందే సీఎం చంద్రబాబు పలుమార్లు వారిని హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి పనితీరు అస్సలు బాగోలేదని.. ఆయనపై వివాదాలు నడుస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ మంత్రి సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఉన్నారని సమాచారం. అయితే టీడీపీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. అనవసరంగా ఇప్పుడు మంత్రి పదవులను గెలికితే అసలుకే ఎసరు వస్తుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.