AP Cabinet Meeting
AP Cabinet Meeting: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. అందుకే పాలనాపరంగా మరింత దూకుడుగా వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏపీలో డ్రోన్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ నుంచి విడదీసి స్వతంత్ర సమస్త గా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీ డీసీ వ్యవహరించాలని నిర్ణయించారు. డ్రోన్ వ్యవస్థకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ వరదల్లో డ్రోన్ల సహకారంతోనే వరద సహాయ చర్యలు చేపట్టారు. అటు తరువాతే డ్రోన్ల వ్యవస్థను అన్ని రంగాల్లో వినియోగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే తాజా మంత్రివర్గ సమావేశంలో డ్రోన్ల వ్యవస్థ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: రుషికొండ నిర్మాణాలు ఏం చేద్దాం.. చంద్రబాబు మంత్రుల అంతర్మధనం
* సుదీర్ఘ చర్చ..
సుదీర్ఘ చర్చతో క్యాబినెట్ భేటీ( Cabinet meeting) ముగిసింది. చాలా రకాల అంశాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది. అనకాపల్లి జిల్లాలోని డిఎల్ పురం వద్ద క్యాపిటల్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. రాష్ట్రంలో 3 స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు కూడా ఆమోదం లభించింది. బార్ లైసెన్స్ ఫీజును 25 లక్షల రూపాయలకు కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. యువజన, పర్యాటక శాఖ జీవోల రాపిటేషన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 710 కోట్ల హార్డ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. జర్నలిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025 కి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
* కీలక ప్రతిపాదనలకు ఆమోదం.. నాగార్జునసాగర్( Nagarjuna Sagar) లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భూక్యాటాయింపులతో పాటు ఇతర నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకున్నారు. మరోవైపు రుషికొండ భవనాల విషయంలో మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. మంత్రులంతా ఓసారి ఆ భవనాలను పర్యటించాలని సూచించారు. అటు తరువాత ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పుకొచ్చారు.
* కొనసాగుతున్న ఆనవాయితీ..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గం సమావేశం అవుతోంది. దీనిని ఇలానే కొనసాగించాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు, ప్రధాని మోదీకి ఆహ్వానం వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.