AP Cabinet meeting : ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలపై సీఎం చంద్రబాబు, మంత్రివర్గం చర్చించింది. పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి సి ఆర్ డి ఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం రక్షిత నీటి సరఫరాకు సంబంధించి రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలో రూ.8.22 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కూడా ఆమోదం తెలిపింది క్యాబినెట్. ఈ రెండు చోట్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉండడంతో రక్షిత మంచినీటి పథకం అందించింది అప్పట్లో టిడిపి ప్రభుత్వం. వైసిపి ప్రభుత్వం నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఇప్పుడు గ్యాప్ ఫండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
Also Read : జూన్ 4న ఏపీ క్యాబినెట్ భేటీ
* 17 మంది ఖైదీలకు క్షమాభిక్ష..
అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ సంస్థలకు కేటాయించిన భూములతో పాటు ప్రభుత్వం అందించే రాయితీల కల్పనకు ఏపీ క్యాబినెట్( AP cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖైదీల క్షమాభిక్షపై ఏపీ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది.
* పోలీస్ అకాడమీ( Police Academy) కోసం అదనంగా 94.45 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది.
* 248 మంది కానిస్టేబుల్ ప్రమోషన్ పై ( promotions )కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారికి పదోన్నతి కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
* రాష్ట్రంలో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
* వైయస్సార్ జిల్లా పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చిన సంగతి తెలిసింది. జిల్లా పేరు మార్పు పై విడుదల చేసిన జీవోను క్యాబినెట్ ఆమోదించింది.