AP Assembly Session: ఏపీకి నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. తాజాగా ఆయన లింక్‌డ్ ఇన్ ఖాతాపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. ఏసీపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆయన బయో అప్‌డేట్ చేశారు. బిజినెస్ , ఎంప్లాయిమెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్‌డ్ ఇన్‌లోలో ఆయన చేసిన ఓ పోస్టుపై మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్‌్సలో వైరల్ అవుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. టెక్నాలజీని వాడటంలో, ప్రోత్సహించడంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడి సృష్టించే చంద్రబాబు ఈసారి కూడా తన పోస్టును అదే రీతిలో చేశారు.
లింక్డ్ఇన్ ప్రొఫైల్‌పై చర్చ..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు జూన్ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ అప్‌డేట్ చేశారు. అలాగే తన లింక్‌డ్ ఇన్‌లో మాత్రం ఓ పోస్టు పెట్టారు. ‘ఇటీవల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి 164 స్థానాలు సాధించిందని ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. తమ మూడు పార్టీల కూటమిలో ప్రజలు నాలుగో పార్టీగా చేరారని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాల్సిన బాధ్యత తమపై ఉంది.. అందుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తాం’ అని ఆయన రాసుకున్నారు.
ఎక్స్‌లో షేర్ చేసిన మహిళ
చంద్రబాబు నాయడు లింక్‌డ్ ఇన్‌లో రాసుకున్న పోస్టును రాధికా ధని అనే ఓ టెకీ.. ఎక్స్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు తన ప్రొఫైల్ నెట్‌వర్కింగ్ చేస్తున్నట్లు లేదని తన రెస్యూమ్ అప్‌డేట్ చేసినట్లు ఉందని ఆమె వ్యాఖ్య చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై చాలా మంది టెకీలు స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు 1995 నుంచి హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన్ను ఏపీ సీఎం అని కాకుండా సీఈవో అని పిలుచుకుంటారని కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చిన అవార్డులు, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల్లో వచ్చిన కవరేజ్ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్ 2.70 లక్షల మంది చూశారు.
లింక్‌డ్ ఇన్ వినియోగం తక్కువ..
రాజకీయ నాయకులు సహజంగా ఎక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటివి వాడుతుంటారు. లింక్‌డ్ ఇన్ లాంటి ప్రొఫెషనల్ వేదికలు ఉపయోగించడం తక్కువ. బిజినెస్ ప్రొఫెషనల్స్, టెక్ సంబంధిత వ్యక్తులు మాత్రమే లింక్‌డ్ ఇన్‌లో ఉంటారు. ఉద్యోగార్థులు ఎక్కువగా దీనిని వాడుతుంటారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేవారు. విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సులూ నిర్వహించారు. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం కోసం ఆయన లింక్‌డ్ ఇన్ వాడుతున్నారు.