Homeఆంధ్రప్రదేశ్‌AP Survey: ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

AP Survey: ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

AP Survey: ఏపీలో మరో సర్వే సంస్థ తన ఫలితాలను వెల్లడించింది. జాతీయస్థాయిలో సర్వే చేపట్టింది. పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికన ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ ఫలితాలనే తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటుఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వైసిపి ఒంటరి పోరుకు సిద్ధం కాగా.. టిడిపి,జనసేన కూటమి కట్టాయి. ఈ కూటమిలోకి బిజెపి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. వామపక్షాలతో కలిసి ఇండియా కూటమిగా పోటీ చేయనుంది. ఈ తరుణంలో ఏపీలో బహుముఖ పోరు తప్పడం లేదు.

ఏపీ సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సిద్ధం పేరిట భారీ సభలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు రా కదలిరా పేరుతో భారీ సభలను ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి జెండా సభలకు సైతం శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేషనల్ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సమస్యలు తమ అంచనాలను బయటపెట్టాయి. మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. తాజాగా జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థ ఒపీనియన్ పోల్ను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఈ సంస్థ సర్వే చేపట్టింది. కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీని తేల్చేసింది.

కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. 377 స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఇండియా కూటమి 94 స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది. ఇతరులు 76 స్థానాల్లో విజయం సాధిస్తారని కూడా చెప్పుకొచ్చింది. ఏపీలో మాత్రం వైసిపి హవా కొనసాగిస్తుందని తేల్చేసింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైసీపీ 19, టిడిపి, జనసేన కూటమి ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. కాంగ్రెస్ బిజెపి ఖాతా కూడా తెరవని తెలిపింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేలింది.

తాజా సర్వే బట్టి ఏపీలో 133 స్థానాలతో వైసిపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 19 పార్లమెంట్ స్థానాలకు గాను 133 అసెంబ్లీ సీట్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 48%, టిడిపి జనసేన కూటమికి 44% ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని తేలడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version