Annadata Sukhibhava: తాజాగా వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రైతుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భార్యాభర్త, పిల్లలతో కలిపి కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కుటుంబంలో ఉన్న అందరి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి సమగ్ర ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రణాళికలను చేపడుతుంది. ముఖ్యంగా ఈ పథకం వ్యవసాయ రంగం, ఉద్యానవనం మరియు పట్టు రంగాలకు సంబంధించి పంటలు సాగు చేసే రైతులకు వర్తిస్తుంది అని తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలను ఈ రంగాలలో నిమగ్నమైన రైతులు పొందవచ్చు. అయితే ఈ పథకానికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు. అలాగే ఆర్థికంగా స్థిరంగా ఉన్న రైతు కుటుంబాలు కూడా అన్నదాత సుఖీభవ పథకం పరిధిలోకి రారు.
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
అలాగే నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న వాళ్లు కూడా ఈ పథకానికి అనర్హులు. వ్యవసాయ భూములను కలిగి ఉన్నవారు అలాగే వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చిన రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలను పొందలేరు అంటూ ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం వారికి ఆర్థిక సహాయం అందించడానికి అనేక పథకాలను అమలు చేసింది. తాజాగా కూడా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి తీసుకొని రానుంది.
ఈ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు ఈ నెలలో రైతుల ఖాతాలలో జమ కానునట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుల కోసం ఈ పథకాన్ని అమలు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకోసం కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వం మహిళలను ఆర్థిక పరంగా బలోపేతం చేయడానికి అనేక పథకాలు తీసుకొని వచ్చింది. నిరుద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక జాబ్ మేళాలు నిర్వహించి కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పించింది.
Also Read: ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ