Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారా? ఆయన ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారా? తన అరెస్టు ఉంటుందని అనుమానిస్తున్నారా? అందుకే ఇప్పుడు ఉన్నఫలంగా మీడియా ముందుకు వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఓటమి ఎదురు కావడంతో కనిపించకుండా మానేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పటి విషయాలను బయటపెడతానంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీంతో అనిల్ కుమార్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.
Also Read: మద్యం కుంభకోణంలో టిడిపి ఎంపీ.. కుటుంబం నుంచే ఆరోపణలు!
* అప్పట్లో సమన్వయంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. అప్పట్లో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి బడానేతగా ఉండేవారు. అనిల్ కుమార్ యాదవ్ సైతం యాక్టివ్ గా ఉండేవారు. అంతా కలిసి పని చేసేవారు. ఆది నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం పెద్ద ఎత్తున మైనింగ్ చేశారు. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పాత విషయాలను తవ్వుతున్నారు. తన జోలికి వస్తే పాత విషయాలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించినట్టు కనిపిస్తోంది.
* పార్టీకి దూరంగా..
గత పది నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా యాక్టివ్ గా లేరు. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సైతం ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏ నియోజకవర్గ బాధ్యతలు కేటాయించలేదు. అటు నరసరావుపేట పార్లమెంటు స్థానం వైపు అస్సలు చూడడం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ కు స్థానం అంటూ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు కూటమినేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారని ఆయన పై సెటైర్లు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారన్నది నెల్లూరు రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.
Also Read : పాత ప్రత్యర్థిని టచ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్.. కథేంటి?
* ఆత్మ రక్షణ కోసమే విమర్శలు..
నెల్లూరులో( Nellore district) సైదాపురం, సిద్ధి వినాయక మైనింగ్ సైట్ల గురించి అనిల్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ రెండు టిడిపి కీలక నేతలకు సంబంధించినవి. ఓ మాజీ మంత్రిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అనిల్ కుమార్ ఆరోపణలు చేస్తే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్సే లేదు. ఈ విషయం తెలిసి కూడా అనిల్ కుమార్ యాదవ్ వాటిపై ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన ఆత్మ రక్షణకు టిడిపి నేతలను టార్గెట్ చేయడం ఒకటే మార్గంగా అనిల్ కుమార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టార్గెట్ చేసిన విధంగానే.. తనపై చేస్తారన్న అనుమానంతోనే అనిల్ ఇటువంటి విమర్శలకు దిగుతున్నారన్నది నెల్లూరు రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. అయితే అనిల్ కుమార్ యాదవ్ ను టిడిపి కూటమి నేతలు లైట్ తీసుకుంటున్నారు.