Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Terror Arrests: విజయనగరం టు కడప.. అంతటా ఉగ్ర మూలాలు.. డేంజర్ లో ఏపీ

Vijayawada Terror Arrests: విజయనగరం టు కడప.. అంతటా ఉగ్ర మూలాలు.. డేంజర్ లో ఏపీ

Vijayawada Terror Arrests: ఏపీలో( Andhra Pradesh) ప్రశాంత వాతావరణం ఉంటుందని అంతా భావిస్తారు. ఉగ్రవాద జాడలు, మతోన్మాదం అనేది లేకుండా ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని మిగతా రాష్ట్రాల వారి భావన. అన్ని మతాలవారు పరస్పరం గౌరవించుకుంటారని కూడా మంచి పేరు ఉంది. ముఖ్యంగా మిగతా రాష్ట్రాల మాదిరిగా ఇస్లామిక్ ఉగ్రవాద జాడలు అస్సలు లేవు అనేది గత కొన్నాళ్లుగా ఉన్న మాట. పక్కనే ఉన్న తెలంగాణలో, కర్ణాటక తో పాటు తమిళనాడులో ఉగ్రవాద కార్యకలాపాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూ వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు అని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ అంచనాలు తప్పు అని ఇప్పుడు తేలుతోంది. గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఏపీలో కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం శరవేగంగా విస్తరిస్తోందని అర్థం అవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న 21 మంది ఉగ్రవాద సానుభూతిపరులు పట్టు పడడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడంటే?

* సేఫ్ జోన్ గా ఏపీ
ఇతర ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. మతోన్మాదంతో ఇస్లామిక్ ఉగ్రవాదం పై( Islamic terrorism) నడిచిన చాలామందికి ఏపీ ఇప్పుడు సేఫ్ సెంటర్ గా మారింది. అప్పుడెప్పుడో కోయంబత్తూర్ పేలుడుకు సంబంధించి ఉగ్రవాదులైన నిందితులు మన ఏపీలోనే తలదాచుకున్నారు. స్థానిక యువతులతో వారి వివాహం కూడా జరిగింది. సాధారణ పౌరులు మాదిరిగా టైలర్లు, మాంసం విక్రయించే వారిగా చలామణి అవుతున్నారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్టులు కూడా జరిగాయి. ఎక్కడెక్కడో విద్వేషాలకు పాల్పడి ఏపీకి వస్తున్నారు. ఇక్కడి వారితో ఇట్టే కలిసిపోతున్నారు.

* గత ఏడాది విజయనగరంలో ఇద్దరు..
గత ఏడాది విజయనగరంలో ఉగ్ర మూలాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు అరెస్టయ్యారు. అందులో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. ఆయన తండ్రి పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఆయన సోదరుడు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన ఆ యువకుడు మతోన్మాద ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. పాకిస్తాన్ ఉగ్రవాదం మూలాలు ఉన్న సంస్థలో సభ్యుడిగా చేరాడు. విధ్వంసాలకు అవసరమైన బాంబులు తయారు చేసే పనిలో కుదిరాడు. విజయనగరం కేంద్రంగా మారుమూల ప్రాంతాల్లో ఆ బాంబు ప్రయోగాలు కూడా చేశాడు. కానీ జాతీయస్థాయిలో నిఘా వర్గాల సమాచారంతో పట్టుబడ్డాడు. జాతీయస్థాయిలో ఉన్న నెట్వర్క్ అంత దొరికిపోయింది. గత ఏడాది కాలంగా ఏపీలో పరిణామాలు చూస్తుంటే మాత్రం శరవేగంగా మతోన్మాద ఉగ్రవాదం విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

* విజయవాడలో ముగ్గురి అరెస్ట్..
తాజాగా విజయవాడలో( Vijayawada) ముగ్గురు ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులు పట్టుబడ్డారు. వారు ఒక సామాన్య వ్యక్తులు. ఒకరు ఓలా డ్రైవర్ గా ఉన్నారు. మరొకరు బిర్యాని పాయింట్ లో సేల్స్ మ్యాన్. ఇంకొకరు ఆటో గ్యారేజీలో పనిచేసే చిరు ఉద్యోగి. విజయవాడ వింజ్ పేటలో ఉండే మహమ్మద్ రహమతుల్లా… అబ్దుల్ రజాక్ వీధిలో ఉండే మీర్జా సోహైల్ బేగిని, భవానిపురం లో మహమ్మద్ తానిష్ ఇలా ఈ ముగ్గురు విజయవాడలో వేరువేరు ప్రాంతాల్లో పట్టుబడ్డారు. వీరిని కలిపింది ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే సోషల్ మీడియా గ్రూప్. ఈ ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ కు ఆల్ ఖైదాతో పాటు iskp తో సంబంధాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ గ్రూపు. కేవలం మొత్తం అనే ఉన్మాదాన్ని చూపించి పెద్ద ఎత్తున యువతను ఆకర్షించాలన్నది ప్రణాళిక. విజయవాడలో ఈ ముగ్గురు అరెస్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా 12 మంది అరెస్టు అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది విజయనగరం, కడప, కర్నూలు, నెల్లూరు,, ఇప్పుడు విజయవాడ.. ఇలా చూసుకుంటే ఏపీలో కూడా మతోన్మాద శక్తులు ప్రవేశించాయి. ఉగ్రవాద విస్తరణకు ప్రయత్నిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలు వెళ్లే యువతను టార్గెట్ చేసుకుని.. వారి అవసరాలను గుర్తించి ఈ మతోన్మాద శక్తులు వారిని ఆకర్షిస్తున్నాయి. వారిని తక్కువగా చూస్తే మాత్రం భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల మాదిరిగా ఉగ్రవాద జాడలతో ఏపీకి ఇబ్బందికరమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version