Homeఆంధ్రప్రదేశ్‌AP Summer Holidays 2026: ఏపీలో వేసవి సెలవుల షెడ్యూల్ లో మార్పు..

AP Summer Holidays 2026: ఏపీలో వేసవి సెలవుల షెడ్యూల్ లో మార్పు..

AP Summer Holidays 2026: ఏపీలో( Andhra Pradesh) వేసవి సెలవులపై కీలక అప్డేట్. సెలవులు ప్రారంభమవుతున్న వేళ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గతం కంటే భిన్నంగా ఈసారి సెలవులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు పదో తరగతి పరీక్షల ఫలితాలు మే రెండు లేదా మూడో తేదీల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం పై కూడా అప్డేట్ ఇచ్చింది. ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు 48 రోజులపాటు వేసవి సెలవు దినాలు కొనసాగుతున్నాయి. ఈనెల 23న చివరి వర్కింగ్ డే. అయితే ఈసారి విద్యార్థులకు వేసవి తాపం తగలకుండా ఉండేందుకు ఎలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

* విద్యార్థుల దినచర్యపై దృష్టి..
ఈ వేసవి సెలవుల్లో విద్యార్థుల దినచర్య పై విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్ళనివ్వొద్దని తల్లిదండ్రులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపించవద్దని సూచించారు. టీవీలు, సెల్ఫోన్లో ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని స్కూళ్లలో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. పిల్లలు వేసవిలో తేలికపాటి దుస్తులు ధరించేలా చూడాలని కూడా తల్లిదండ్రులను సూచిస్తోంది ప్రభుత్వం. సెలవులు పూర్తయ్యేలోగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అధికారులను.

* బడి పిలుస్తోంది..
ఇప్పటికే ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా మే మొదటి వారంలో ప్రకటించనున్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచాలన్న ఉద్దేశంతో బడికి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఈనెల 23న ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది బడికి పిలుస్తోంది లో భాగంగా భారీగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయి. ఈ ఏడాది కూడా అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం బడికి పిలుస్తోంది కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహిస్తోంది. మరోవైపు పదో తరగతి ఫలితాలు విడుదలకు సంబంధించి అధికారులు కీలక సూచనలు చేశారు. మనబడి యాప్ తో పాటు వివిధ మార్గాల్లో పదో తరగతి ఫలితాలు విడుదలకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version