AP Group 2: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష 2025కి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. ఈ పరీక్ష ఫిబ్రవరి 23, 2025న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించబడింది. పేపర్–1 మరియు పేపర్–2లకు సంబంధించిన ప్రాథమిక కీలను APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లో ఫిబ్రవరి 23, 2025 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచింది. పేపర్–1 కీ: ఫిబ్రవరి 23, 2025 సాయంత్రం విడుదలైంది. పేపర్–2 కీ: అదే రోజు అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.
కీ డౌన్‌లోడ్ ఇలా…
APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inని సందర్శించండి.
హోమ్‌పేజీలో ‘”Announcements”‘ లేదా ‘”Answer Key”సెక్షన్‌ను చూడండి.
Group-2 Mains Answer Key 2025‘ లింక్‌పై క్లిక్ చేయండి.
పేపర్–1 లేదా పేపర్–2 కీని ఎంచుకొని డౌన్‌లోడ్ చేసుకోండి.
అభ్యంతరాలు ఇలా..
ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే, ఫిబ్రవరి 25 నుంచి 27, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. అభ్యంతరాలు సమర్పించేందుకు నిర్దిష్ట ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు, మరియు దానితో పాటు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి తమ స్కోరును అంచనా వేసుకోవచ్చు.