Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవి ప్రారంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. 10 గంటలకు విశ్వరూపం చూపుతోంది. ఉదయం నుంచి ఎండలు ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగానే నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అలానే నమోదవుతున్నాయి. మున్ముందు ఈ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* రాయలసీమలో..
ప్రధానంగా రాయలసీమ( Rayalaseema ) జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు మేలో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
* ఉత్తరాంధ్రలో పరిస్థితి తీవ్రతరం..
మరోవైపు ఉత్తరాంధ్రలో ( North Andhra) సైతం పరిస్థితి తీవ్రతరంగా ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత కొద్దిరోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మబ్బుల వాతావరణం కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి బలహీన పడింది. దీంతో మళ్లీ వేడి వాతావరణం ప్రారంభం అయింది. ఈరోజు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని ముందస్తు హెచ్చరికలు పంపింది విపత్తుల నిర్వహణ సంస్థ.
* నిపుణుల హెచ్చరిక..
ఎండల తీవ్రత( summer heat) పెరుగుతున్న దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటున్నారు. వేసవి తీవ్రతతో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. నీటితోపాటు శీతల పానీయాలు వంటివి అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!