AP Ammonia: నార్వేకు ఆంధ్రా అమ్మెనియా..!

గ్రీన్‌కో సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో అమ్మెనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 8:15 am

AP Ammonia

Follow us on

AP Ammonia: మన దేశానికి అవసరమైన ఖనిజాలు, ఇంధనాలను మనం దిగుమతి చేసుకుంటున్నట్లుగానే.. మన అపారంగా ఉన్న ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ క్రమంలో కాకినాడలో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సంస్థ తయారు చేస్తున్న పునరుత్పాదక అమో‍్మనియాను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న నార్వేకు చెందిన యారా క్లీన్‌ అమ్మెనియా సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు గ్రీన్‌కో సంస్థ ఉత్పత్తి చేసే పునరుత్పాదక అమ్మెనియాలో 50 శాతం యారీ క్లీన్‌ అమ్మెనియా సంస్థక సరఫరా చేస్తుంది.

కాకినాడలో తయారీ..
గ్రీన్‌కో సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో అమ్మెనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్ విభాగం పర్యవేక్షిస్తుంది. ఈమేరకు టర్మ్‌ షీట్స్‌పై ఏఎం గ్రీన్‌ సంస్థ సంతకం చేసింది. ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్ 1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా 50 శాతం యారా క్లీన్‌కే సరఫరా చేయాల్సి ఉంటుంది.

పలు సంస్థలకు పరఫరా..
గ్రీన్‌కో సంస్థ తయారు చేస్నుత్న పునరుత్పాదక అమ్మెనియాను యారా క్లీన్‌ సంస్థకు సరఫరా చేయగా, ఆ సంస్థ దీనిని ఎరువుల తయారీ కంపెనీలు, ఫిప్పింగ్‌, పవర్‌ ఇండస్ట్రీలకు, ఇతర పరిశ్రమలకు సరఫరా చేస్తుందని ఏఎం గ్రీన్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కొల్లి తెలిపారు. ఇందులో గ్రీన్‌కో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని తెలిపారు. యారా క్లీన్‌ అమ్మెనియా సీఈవో హన్స్‌ ఓలావ్‌ రేన్‌ మాట్లాడుతూ ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్టులో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోందని తెలిపారు. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ అమ్మోనియా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.