Anchor Shiva Jyothi Trolls: ఎంతో కష్టపడితే తప్ప సెలబ్రిటీ హోదా రాదు. ఆ సెలబ్రిటీ హోదా వచ్చినవారు దానిని కాపాడుకోవాలి. తమకు ఇంత ఇచ్చిన సొసైటీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా తమ సెలబ్రిటీలం.. ఏదైనా చేస్తాం.. ఎలాగైనా వాగుతామంటే.. దాని తదుపరి పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఈ పరిణామాలను టీవీ యాంకర్ శివ జ్యోతి ఎదుర్కొంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం తిరుమలను అద్భుతమైన క్షేత్రంగా భావిస్తూ ఉంటుంది. తిరుమలలో శ్రీవారిని జన్మలో ఒకసారైనా దర్శించుకుంటే చాలని అనుకుంటుంది. అందువల్లే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం మాదిరిగా విలసిల్లుతూ ఉంటుంది. అటువంటి క్షేత్రం జోలికి ఎవరు వచ్చినా సరే పరిణామాలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. అంతటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తిరుమల క్షేత్రంలో జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయంగా ఎంతటి ఇబ్బంది పెట్టాలో.. అంతటి ఇబ్బంది పెడుతున్నాయి. అటువంటిది ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించి శివ జ్యోతి మెదడులేని వ్యాఖ్యలు చేసింది.. నాలుక ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడింది. అది కాస్త ఇప్పుడు ఆమెకు చుక్కలు చూపిస్తోంది.
సహజంగానే తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటారు.. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత.. లడ్డు ప్రసాదాన్ని అత్యంత పరమ పవిత్రంగా భావిస్తుంటారు.. అటువంటి ప్రసాదం పై శివ జ్యోతి వెకిలి వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో విలువైన ప్రసాదం ఆడుకుంటున్నామని.. తాము అత్యంత విలువైన బిచ్చగాళ్ళమని శివ జ్యోతి వ్యాఖ్యానించింది. అసలే నేటి సోషల్ మీడియా కాలంలో మాట్లాడే మాట మీద అదుపు ఉండాలి. సెలబ్రిటీలకు మరింత ముఖ్యంగా అదుపు ఉండాలి. అలాకాకుండా సెలబ్రిటీ అయిన శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క పిచ్చిపిచ్చిగా మాట్లాడింది. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడింది.
శివ జ్యోతి చేసిన వ్యాఖ్యల పట్ల వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు.. సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తిరుమల సన్నిధిలో అందరూ బిచ్చగాళ్లేనని.. ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసాదం గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం శివ జ్యోతి లేకితనానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా శివ జ్యోతి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.. లేనిపక్షంలో శివ జ్యోతి మీద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.