Tejas fighter jet crashed: భారతీయ హిందుస్తాన్ ఎరోనాటిక్స్‌లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసిన తేజస్ ఫైటర్ జెట్ దుబాయ్ ఎయిర్ షో 2025లో డెమోన్‌స్ట్రేషన్ ఫ్లైట్ చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఇది భారత వాయుసేనకు పెద్ద షాక్. నవంబర్ 21, మధ్యాహ్నం 2:10 గంటలకు అల మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఈ విమానం తక్కువ ఎత్తులో నియంత్రణ కోల్పోయి పడిపోయింది. ఈ ఘటనలో భారత విమాన అధికారి, వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన దుబాయ్ ఎయిర్ షో చివరి రోజున జరగడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాద కారణాలను విచారణకు ఇదివరకే భారత యావోసేన ఆదేశించింది.
2024 కూడా కూలిన ఫైటర్ జెట్
2024, మార్చి 12న కూడా దేశీయంగా తయారు చేసిన సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ తేజస్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో జెట్ పూర్తిగా కాల్పియింది. అయితే పారాచూట్ సాయంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో కూలిపోయవడం ఇది మొదటిసారి. తర్వాత తాజాగా దుబాయ్ ఎయిర్‌షోలో మరొకటి కూలింది.
ఎయిర్ ఫోర్స్‌లో కీలకం..
సింగిల్ సీటర్ ఫైటర్‌జెట్ తేజస్ భారతీయ వైమానికదళంలో కీలకం. ట్రిన్ సీట్ ట్రెయినర్ వేరియంట్ కూడా ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాయి. ఇండియన్ నేవీలో కూడా ట్విన్ సీటర్ వేరియంట్ వినియోగంలో ఉంది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. అఫెన్సివ్ ఎయిర్ సపోర్టు తీసుకునేలా గ్రౌండ్‌పరేషన్స్‌లో క్లోజ్ కంబాట్ సపోర్టు సమకూర్చుకునేలా దీనిని డిజైన్ చేశారు.
వాయుసేనలో 40 జెట్‌లు..
తేజస్ ఫైటర్ జెట్ అత్యంత చిన్న ఎయిర్‌క్రాఫ్ట్. వినియోగించేందుకు ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వద్ద 40 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో 84 తేజస్ ఎంకే–1 ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గతేడాది ఆర్డర్ కూడా చేసింది. ఇందుకు రూ.36,468 కోట్ల డీల్ కుదిరింది. ఇంతలో తాజా ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.
Clearer footage of the Indian Air Force crash at the Dubai Air Show https://t.co/EOfroFXtyS pic.twitter.com/mxkTNNderS
— Open Source Intel (@Osint613) November 21, 2025