20 ఏళ్ళ తర్వాత అతిపెద్ద తుఫాన్ “ఎంఫాన్”

ఎంఫాన్ తుఫాన్ అత్యంత తీవ్రమైన తుఫాన్ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్‌ మత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. 20 సంవత్సరాల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా పేర్కొన్నారు. ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంవైపు శరవేగంగా వస్తోంది. అంతేకాక ఈతుపాన్‌ ప్రభావం ఏపిలో కూడా కనిపిస్తుందని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర, […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 1:25 pm
Follow us on


ఎంఫాన్ తుఫాన్ అత్యంత తీవ్రమైన తుఫాన్ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్‌ మత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. 20 సంవత్సరాల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా పేర్కొన్నారు. ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంవైపు శరవేగంగా వస్తోంది. అంతేకాక ఈతుపాన్‌ ప్రభావం ఏపిలో కూడా కనిపిస్తుందని ఆయన తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘ఎంఫాన్’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని మత్యుంజయ్‌ మహాపాత్ర వివరించారు.