Ambati Rambabu on HHVM: పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)ప్రముఖ నటుడు. తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. జయ అపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్ని రకాల అపజయాలు ఎదురైనా.. సినీ పరిశ్రమంలో తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్నారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి సమయంలో సైతం పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. వాటిని పూర్తిచేసే పనిలో పడ్డారు. అయితే దానిని రాజకీయం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ చిత్రంపై స్పందించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
Also Read: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు!
అంబటి ట్వీట్ తో
ఈ సినిమా విడుదల సందర్భంగా అంబటి రాంబాబు( ambati Rambabu) ట్వీట్ చేశారు. పవన్ కు శుభాకాంక్షలు చెబుతూ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ తేల్చి చెప్పారు. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. జన సైనికులు అనుమానంగా చూశారు. అది శుభాకాంక్షలు చెప్పినట్టు కాదని.. ఆయన సెటైరికల్ గా మాట్లాడారు అంటూ ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా స్పందించారు అంబటి రాంబాబు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదన్నట్టు చురకలు అంటించారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ కు విలువైన సలహా ఇచ్చారు. పవన్ గారు మిగతా సినిమాలు సైతం వేగంగా పూర్తి చేయండి అంటూ సూచించారు. ప్రస్తుతం ఓజీతో పాటు మరో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంబటి రాంబాబు అటువంటి ప్రకటన చేయడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. కచ్చితంగా దీని వెనుక సెటైర్ ఉందని జనసైనికులు భావిస్తున్నారు.
సినిమా చుట్టూ కుట్ర..
హరిహర వీరమల్లు( Harihara Veera Mallu ) చుట్టు ఒక రకమైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ సైతం గట్టిగానే మాట్లాడారు. వైసిపి పై పొలిటికల్ పంచులు విసురుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పవన్ సినిమాలు ఆయన ఇష్టం. ఆయన నిర్మాతల ఇష్టం. ఎప్పుడు విడుదల చేసుకుంటారో వారి ఇష్టం. కానీ వైసీపీ నేతలు ఈ తరహా ప్రకటనలు చేయడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. అయితే దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన వ్యూహమే ఉంది. హరిహర వీరమల్లు చిత్రానికి భారీగా టికెట్లు ధర పెంచారని.. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాత ఏఎం రత్నం నష్టపోయారని చెప్పేందుకే అంబటి రాంబాబు అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
Also Read: రైతుల ఖాతాలో రూ.7,000.. ముహూర్తం ఫిక్స్!
వివాదాన్ని పెంచాలని..
ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో( cinema industry) పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ పెద్దలతో చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఏర్పడిందన్న కామెంట్స్ వినిపించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంబటి రాంబాబు అగ్గిమీద గుగ్గిలం రాజేసేందుకు.. చిత్ర నిర్మాతలను పవన్ పై ఎగదోసేందుకు అలా మాట్లాడి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పవన్ విషయంలో అనవసరంగా వ్యాఖ్యలు చేసి చేజేతులా ఇబ్బందులు తెచ్చుకున్నారు వైసీపీ నేతలు. దానిని గుణపాఠంగా మార్చుకోవాల్సింది పోయి.. తిరిగి పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆగ్రహం వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్లలో ఉంది. కానీ వ్యూహంలో భాగంగానే అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.