Ambati Rambabu Daughter Wedding: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) ఇంట సందడి నెలకొంది. అయితే అది ఏపీలో కాదు.. అమెరికాలో. అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు, వరుడి తరపు బంధువుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు తన కుమార్తె వివాహ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భావించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొద్దిమందితోనే ఈ తంతును పూర్తి చేశారు. అదే విషయాన్ని ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. కొద్ది రోజుల కిందట అంబటి రాంబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో రకరకాల చర్చ సాగగా.. అది కుమార్తె పెళ్లి కోసమేనని తాజాగా తెలుస్తోంది.
* ప్రేమ వివాహం
అంబటి రాంబాబు కుమార్తె.. డాక్టర్ శ్రీజ( doctor Sreeja ) ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు జాస్తి హర్ష అమెరికాలో డూయిచ్ బ్యాంకులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. హర్షది పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా.. ఆయనది కమ్మ సామాజిక వర్గంగా తెలుస్తోంది. అయితే వీరి వివాహానికి హర్ష తల్లిదండ్రులు హాజరు కాలేదని తెలుస్తోంది. శ్రీజ, హర్షాలను అంబటి రాంబాబు అందరికీ పరిచయం చేశారు. తన అల్లుడు గురించి వివరాలు సరిగ్గా తెలియదని.. తన కుమార్తెదు ప్రేమ వివాహంగా చెప్పుకొచ్చారు. ఈ పెళ్లి ఏపీలో చేయాలనుకున్నామని… ట్రంప్ దెబ్బతో వస్తే మళ్లీ వెనక్కు రానివ్వరేమోనని ఆలోచించి అమెరికాలోని వివాహం జరిపించామని చెప్పారు. వరుడు హర్ష తల్లిదండ్రులు వివాహానికి రాలేకపోయారని.. వారికి వీసా సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. మూడుసార్లు ప్రయత్నం చేసిన వీసా రాలేదు అన్నారు. అందుకే వారు లైవ్ లో పెళ్లి చూడాల్సి వచ్చిందన్నారు. తన కుమార్తె, అల్లుడు ఏపీకి వస్తే రిసెప్షన్ ఏర్పాటు చేస్తామన్నారు అంబటి రాంబాబు.
* వైసీపీలో చాలా యాక్టివ్ గా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు అంబటి రాంబాబు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతల్లో ఆయన ఒకరు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. కేవలం రాజకీయాలు మాత్రమే కాదు సినిమా రివ్యూలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా కుమార్తె వివాహానికి అమెరికా వెళ్లారు అంబటి రాంబాబు. అక్కడ కూడా ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నారు. అయితే తన అల్లుడిని పరిచయం చేస్తూ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
USA లో ఘనంగా అంబటి రాంబాబు కూతురు శ్రీజ వివాహ వేడుకలు.
స్నేహితులు మధ్య కూతురు వివాహం చేసిన అంబటి రాంబాబు. pic.twitter.com/Wq9gA3a1NJ
— (@YSJ2024) October 4, 2025