Ambati Rambabu Counter to Pawan: కొందరు నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు. నవ్వుల పాలు అవుతారు. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. ఆయనేదో సెటైరికల్ గా మాట్లాడాలని చూస్తారు కానీ.. ఇట్టే అడ్డంగా బుక్ అవుతారు. మొన్న ఆ మధ్యన విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు వ్యవస్థల పట్ల అవగాహన కల్పించేందుకు వీలుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది అసెంబ్లీలో అనుకొని అంబటి రాంబాబు ఏదేదో మాట్లాడారు. ఏంటా పని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతలోనే మీడియా ప్రతినిధులు బయట కార్యక్రమం నిర్వహించారని చెప్పడంతో అంతటితో విడిచిపెట్టండి అంటూ వారిని ప్రాధేయపడ్డారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై పడ్డారు అంబటి. ఆయనేదో తన సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే తనను సంబరాల రాంబాబు అన్నారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఏమి అనాలని ప్రశ్నించారు రాంబాబు.
ముందస్తు సంబరాల్లో పవన్..
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ముందస్తు సంబరాల వేడుకల్లో ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం పిఠాపురం వచ్చారు. సంబరాల్లో భాగంగా గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఇప్పుడు దానిని గురించి ప్రస్తావిస్తున్నారు అంబటి. సంక్రాంతికి తాను డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు నా? పవన్ చేస్తే అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక్కడ కూడా ఎక్కువమంది అంబటి రాంబాబును తప్పు పడుతున్నారు. ఆయనతో పోలిక ఏంటి? నెవర్ అంటూ బదులిస్తున్నారు.
సెటైరికల్ కామెంట్స్
అసలు పవన్ కళ్యాణ్ తో అంబటి రాంబాబుకు పోలిక ఏంటి అనేవారు అధికం. అంబటి అరగంట ఆడియో వైరల్ అయిందని.. అందుకే మహిళలతో అంబటి డాన్స్ చేసిన వీడియో కు సంబరాల రాంబాబు అని పేరు వచ్చిందని సెటైరికల్ గా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. అయితే ఎందుకో అంబటి రాంబాబు అనవసరంగా పవన్ కళ్యాణ్ విషయంలో కెలుకుతున్నారు. వైసిపి హయాంలో రహదారులపై సంక్రాంతి సంబరాలు చేశారు. సంప్రదాయంగా నృత్యాలు చేసి ఉంటే ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. కానీ తనకు నచ్చిన విధంగా అంబటి రాంబాబు డాన్సులు వేశారు. అందుకే అప్పుడు విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. మరోవైపు ఓ సినిమాలో పవన్ సైతం సంబరాల రాంబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఆ సినిమాలో అంబటి రాంబాబు డాన్స్ కు పోలిన విధంగా.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి డాన్స్ తో అలరించారు.
సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే
సంబరాల రాంబాబునా?మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB
— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026