Ambati Rambabu Arrest: రాష్ట్రంలో టిడిపి( Telugu Desam Party) కూటమి ప్రభుత్వం తమను కేసులతో ఇరుకున పెడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అటువంటప్పుడు ఆ పార్టీ నేతలు భయపడాలి కదా. కానీ వారి ఇప్పుడు సౌండ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తమను ఏమీ చేయలేదని కదా? తాము అధికారంలోకి వస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు అన్న విషయాన్ని వారికి తెలుసు. అయినా సరే ఇటువంటి సవాళ్లు చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టిడిపి ప్రభుత్వం వచ్చింది. ఎన్నడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జోలికి వెళ్లలేదు. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబుకు అంత తీరిక కూడా లేదు. ఆపై విపక్షాన్ని ఏదో చేయాలన్న ఆసక్తి లేదు. ఆయన దృష్టంతా విభజన సమస్యలు పరిష్కరించుకొని అమరావతి పనులు మొదలుపెట్టడం, రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడుల పైనే ఉండేది. చివర్లో బిజెపితో గ్యాప్ వంటి కారణాలతో అప్పుడు ఐదేళ్లు అలా గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గురించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేకుండా పోయింది. అంతెందుకు 2019లోనే వివేక హత్య సమయంలో కూడా దృష్టి సారించ లేకపోయారు. అసలు విషయాన్ని గ్రహించలేక రాజకీయంగా ఇబ్బంది పడ్డారు.
* అప్పట్లో దృష్టిపెట్టలేక..
2014 నుంచి 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) జోలికి వెళ్లలేకపోయారు చంద్రబాబు. అయితే అదేదో చెయ్యాలన్న ఆలోచన ఉండేది కాదు. ప్రతిపక్షాన్ని బతకనిస్తూ.. తన పని తాను ముందుకు తీసుకెళ్లగలిగే వారు. అయితే ఇప్పుడు అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పటి మాదిరిగా వ్యవహరించలేకపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత వ్యవహరించిన తీరు ఆయనకు తెలుసు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడారు. చంద్రబాబును జైల్లో పెట్టించి సక్సెస్ సాధింపు చేసుకున్నారు. దానికి జగన్ కూడా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ప్రజలు దారుణంగా శిక్షించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసి అమరావతి, అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు.
* మెతకవైఖరి తగదు
అధికారానికి దూరమైన తరువాత కూడా కొంతమంది వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. అటువంటి వారిని టార్గెట్ చేసుకున్నారే తప్ప.. నిండు సభలో చంద్రబాబు( CM Chandrababu) సతీమణిని దారుణంగా అవమానించిన కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా వంటి వారి జోలికి ఇంకా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ ని దారుణంగా అవహేళన చేసిన జగన్ జోలికి పోనే పోలేదు. అయితే ఇదే వైసీపీ నేతలకు అలుసుగా మారినట్లు కనిపిస్తోంది. అందుకే రప్పా రప్పా అంటూ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేష్ మెతక వైఖరి కారణంగానే వారు అలా రెచ్చిపోతున్నారని టిడిపి తో పాటు జన సైనికులు మండిపడుతున్నారు. అయితే తాజాగా గుంటూరులో అంబటి రాంబాబు రెచ్చిపోయిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జస్ట్ ఒకేసు పెట్టి వదిలేస్తారనే ధైర్యంతోనే అంబటి అంతగా రెచ్చిపోయారని అర్థమవుతూనే ఉంది.
* ప్రవర్తన అభ్యంతరకరం..
అంబటి రాంబాబు( ambati Rambabu) వైఖరి వైసీపీ శ్రేణులకు నచ్చవచ్చు. కానీ సమాజం పట్ల అవగాహన ఉన్నవారికి, తటస్థులకు మాత్రం ఆయన వైఖరి అభ్యంతరకరమే. అయితే అంబటి వ్యవహరించిన తీరు టిడిపి శ్రేణుల అహం పై దెబ్బ కొట్టాయి. గుంటూరు పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నప్పుడు.. టిడిపి శ్రేణులు ఆయనపై ప్రదర్శించిన ఆగ్రహమే ఎందుకు నిదర్శనం. అంబటి అనుకున్నట్టు కేసు నమోదు చేసి బెయిల్ పై ఇంటికి పంపిస్తే మాత్రం.. అంతకంటే చేతకానితనం మరొకటి ఉండదని టిడిపి శ్రేణులు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటువంటి రఫ్ఫా రఫ్ఫా బ్యాచ్ లను గట్టిగానే చుక్కలు చూపించాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.