Homeఆంధ్రప్రదేశ్‌Amaravati capital legal status: ఈనెల 28న 'అమరావతికి' చట్టం!

Amaravati capital legal status: ఈనెల 28న ‘అమరావతికి’ చట్టం!

Amaravati capital legal status: అమరావతి( Amaravati capital ) ఏకైక రాజధానిగా గుర్తించేందుకు ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో తలెత్తిన అయోమయాన్ని తెరదించుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదిస్తూ కేంద్రానికి నివేదించనున్నారు. తద్వారా అమరావతికి చట్టబద్ధత దక్కనుంది. అందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

పూర్తయిన ఉమ్మడి రాజధాని గడువు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో భాగంగా హైదరాబాదును( Hyderabad) ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు కొన్నేళ్లపాటు. అయితే ఆ గడువు ముగియనుండడంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను.. అమరావతిని నోటిఫై చేస్తూ ముందుగా శాసనసభలో తీర్మానం చేస్తారు. అదే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. కేంద్రం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం ప్రకటించనుంది. ఇకనుంచి అమరావతి రాజధానిని కదిలించలేని విధంగా మార్చేందుకు.. ఈనెల 28న శాసనసభ సమావేశం కీలకం కానుంది.

Also Read: జగన్ చేయరు.. చేస్తే ఓర్వలేరు.. ఆర్టీడీపై కొత్త ఏడుపు!

పెద్ద ఎత్తున నిధులు..
రాజధానిపై చట్టపరమైన స్పష్టత రానుండడంతో మౌలిక వసతుల కల్పన మరింతగా జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులనుంచి 15 వేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం ద్వారా రాజ్యాంగబద్ధ నిధులన్నీ ఇకనుంచి అమరావతికి వర్తించనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇకమీదట అమరావతిని ఎవరూ టచ్ చేయలేనంతగా బలోపేతం చేయనున్నారు చట్టాన్ని. గతంలో మూడు రాజధానుల తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదు కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version