Amaravati false propaganda : అమరావతి రాజధాని( Amaravathi capital ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదా? మొన్నటి ఎన్నికల్లో మూడు రాజధానుల అంశంపై ప్రజల వ్యతిరేకతను గుర్తించలేదా? మూడు రాజధానులకు ప్రజలు హర్షించలేదని గ్రహించలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతం మాదిరిగా అమరావతి రాజధానిని విస్మరిస్తామంటే కుదరదు. మరోసారి మూడు రాజధానుల అంశం తెరపైకి తెస్తామంటే కుదిరే పని కాదు కూడా. అయినా సరే అమరావతి రాజధానిపై అవాకులు చెవాకులు కొనసాగిస్తుండడం వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా అన్నది తెలియాల్సి ఉంది. తాజాగా అమరావతిలో ఆ టైపు మహిళలు ఉన్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల జర్నలిస్టు ఒకరు నోరు జారారు. సాక్షి మీడియా విశ్లేషకుడిగా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ రావు దానిని సమర్థించారు. అయితే దీనిపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై అంతటా చర్చ నడుస్తోంది. ఆ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతి పై విషం చిమ్మడం ఆపరా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
* ఏకాభిప్రాయంతో అమరావతి
2014లో తెలుగుదేశం( Telugu Desam) అధికారంలోకి వచ్చింది. అందరి అభిప్రాయం తీసుకుని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే నాడు అమరావతిని ఆహ్వానించారు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. మరింత భూ సేకరణ చేయాలని కూడా సూచించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం మాట మార్చారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. 2019 నుంచి 2024 వరకు అమరావతి పై విష ప్రచారం చేశారు. కమ్మ రాజధాని అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో విషం చిమ్ముతున్నారు. సాక్షి ఛానల్ డిబేట్లో పాల్గొన్న కృష్ణంరాజు అనే జర్నలిస్టు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. అమరావతి వేశ్యలకు రాజధాని అంటూ అతడు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాతో పాటు అన్నిచోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అతనిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అతని ఫోన్ నెంబర్లు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.
Also Read: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం
* ఆది నుంచి ఆయన తీరు అంతే..
అయితే ఆది నుంచి సాక్షి మీడియాలో విశ్లేషకుడిగా పనిచేస్తున్న కొమ్మినేని( Kommineni Srinivasa Rao ) శ్రీనివాసరావు అమరావతిపై విషప్రచారం చేస్తూనే ఉన్నారు. విశ్లేషకుడి ముసుగులో ఆయన చంద్రబాబు వ్యతిరేక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి అంటే చంద్రబాబుకు పేరు వస్తుందని భావించి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసే విశ్లేషణలు కూడా అడ్డగోలుగా ఉంటాయి. కేవలం టిడిపి తో పాటు చంద్రబాబును వ్యతిరేకించే వారిని మీడియా డిబేట్ కు పిలిచి మాట్లాడిస్తుంటారని కొమ్మినేని పై ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ను సమర్ధించారు కూడా తాజాగా. అలా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు.
* చర్యలకు డిమాండ్..
అయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అమరావతిని ఆపలేరు కూడా. అయితే ఇప్పుడు అదే పనిగా విష ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలకు ఉపక్రమించకపోతే మాత్రం.. అదేపనిగా అమరావతిపై విష ప్రచారం చేసేవారు పుట్టుకొస్తారు. అందుకే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.