Homeజాతీయ వార్తలుInduction Stove Government: ఇండక్షన్ స్టవ్ లు వాడేవారికి కేంద్రం గుడ్ న్యూస్

Induction Stove Government: ఇండక్షన్ స్టవ్ లు వాడేవారికి కేంద్రం గుడ్ న్యూస్

Induction Stove Government: మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. దీంతో మన దేశానికి సహజవాయువు.. చమురు అవసరాలకు తగ్గట్టుగా రావడం లేదు. దీంతో దేశ అవసరాలు పెరిగిపోవడం.. సప్లై లేకపోవడంతో.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. ముఖ్యంగా హోటళ్లు, హాస్టళ్లు చాలావరకు మూతపడ్డాయి. కొన్నింట్లో ప్రత్యామ్నాయంగా కర్రలతో వంటలు చేస్తున్నారు. డీజిల్ తో స్టవ్ లు ఏర్పాటుచేసి.. వాటి మీద వంటలు వండుతున్నారు.

ఇలా ఎన్ని రకాలుగా ప్రత్యామ్నాయాలు చూసుకున్నప్పటికీ.. ఎల్పిజి తీర్చినట్టుగా అవసరాలు తీరడం లేదు . దీంతో ప్రజలు ఇండక్షన్ స్టవ్ లు కొనుగోలు చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ లు ఎలక్ట్రిసిటీ ఆధారంగా పనిచేస్తాయి. గతంలో ఇండక్షన్ స్టవ్ లకు గిరాకీ మామూలుగా ఉండేది. ఎప్పుడైతే గ్యాస్ కొరత ఏర్పడిందో అప్పటినుంచి ప్రజలు వీటిని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అనేక సంస్థలు రాయితీలు కూడా ఇవ్వడం ప్రారంభించాయి..

ఇండక్షన్ స్టవ్ లకు స్టార్ రేటింగ్ ఉంటుంది. వాటి ఆధారంగానే కొనుగోలు జరుగుతుంటాయి. అయితే ఇండక్షన్ స్టవ్ ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి అమలుకు కావలసిన స్టార్ రేటింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం దాదాపు 6 నెలలపాటు వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం వంట గ్యాస్ కు విపరీతమైన కొరత ఉంది. దీంతో ప్రజలు ఇండక్షన్ స్టవ్ లను కొనుగోలు చేస్తున్నారు..

కొత్త నిబంధనల వల్ల మార్కెట్లోకి స్టౌ లు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువల్లే కేంద్రం రేటింగ్ నిబంధన విషయంలో ఆరు నెలల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల 2027 జనవరి 1 నుంచి రేటింగ్ నిబంధన అందుబాటులోకి వస్తుంది. ఇండక్షన్ స్టవ్ లు తక్కువ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని పనిచేస్తుంటాయి. గతంలో వీటిని వినియోగించాలంటే ప్రజలు భయపడేవారు. అయితే ఇప్పుడు ఇందులో అత్యంత ఆధునికమైన మార్పులు రావడంతో వాడటం చాలా సులువు అయిపోయింది. పైగా తక్కువ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుని ఇవి పని చేస్తాయి. అందువల్లే వీటి వాడకం పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గ్యాస్ ధర కూడా పెరిగిన నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్ వాడటం ఉత్తమం అని ప్రజలు భావిస్తున్నారు.

ఇండక్షన్ స్టవ్ లకు డిమాండ్ పెరిగినప్పటికీ కంపెనీలు ధర అంతగా పెంచలేదు. పైగా ఆన్లైన్లో ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ప్రెస్టీజ్, గంగ, సూర్య వంటి కంపెనీలు ఇండక్షన్ స్టవ్ లను తయారు చేస్తున్నాయి. వీటిలో రకరకాల మోడల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. హోటల్ నిర్వాహకులు కూడా స్టవ్ లను ఉపయోగిస్తుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version