Amaravati Capital Latest News: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్దం దాటింది. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు పరిమితమైంది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. గడువు కూడా ముగిసింది. కానీ, ఏపీకి మాత్రం ఇప్పటికీ రాజధాని లేదు. అయితే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల ఫార్ములా తెరపైకి తెచ్చింది. అదీ కార్యరూపం దాల్చలేదు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతి 2.0ను వేగవతం చేసింది.
Also Read: పవన్‌కు పాలన అనుభవంపై ఎందకంత సందేహం..?
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపొందించాలనే దృష్టి మరోసారి 2025 మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనతో పునర్జన్మ పొందింది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమరావతి 2.0 నిర్మాణం ప్రారంభమైంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆశాజనక లక్ష్యాలతోపాటు, రైతుల అనుమానాలు, రాజకీయ అనిశ్చితులు, గత అనుభవాల నీడలతో సాగుతోంది. 64,912 కోట్ల రూపాయల విలువైన 92 ప్రాజెక్టులతో, సింగపూర్ నిపుణుల సలహాలు, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో, ఈ నగరం బ్లూ–గ్రీన్ కాన్సెప్ట్‌తో 51% గ్రీనరీ, 10% జలవనరులను కలిగి ఉండనుంది. 2026 నాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, 2028 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాలు పూర్తి కానున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఇతర సంస్థల సహకారం ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక బలాన్ని అందిస్తోంది.
వేల ఎకరాల భూసేకరణ..
2014లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాల భూమిని సేకరించారు, రైతులు భవిష్యత్ విలువ పెరుగుతుందనే ఆశతో స్వచ్ఛందంగా∙భూములను అందించారు. అయితే, ఇప్పుడు మరో 44 వేల ఎకరాల అదనపు భూమిని సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయం రైతులలో సందేహాలను రేకెత్తిస్తోంది. గతంలో భూములు ఇచ్చినవారికి ఇంకా హామీ ఇచ్చిన ఫ్లాట్లు, వాణిజ్య ప్లాట్లు అందలేదు. ఇది నూతన భూమి దాతలలో అనిశ్చితి, అనుమానాలు కలిగిస్తోంది.
Also Read: ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ రెడీ.. తేల్చుకోవాల్సింది జగనే!
రాజకీయ సంకల్పం, రైతుల అసంతృప్తి..
2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం, రైతులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు స్థానికులలో అసంతృప్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అమరావతిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, గత రాజకీయ వివాదాలు, రైతుల అసంతృప్తి ఈ ప్రాజెక్ట్‌ను సంక్లిష్టంగా మార్చాయి. కొన్ని గ్రామసభలు రద్దు కావడం ఈ అసమ్మతిని సూచిస్తుంది. అయితే రాజకీయ సంకల్పం ఈ ప్రాజెక్ట్ విజయానికి కీలకం.