Amaravati: సాధారణంగా అమెరికాలో( America) గాలి తుఫానులు ఎక్కువగా వస్తుంటాయి. దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఒక్కోసారి ఈ గాలులతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారీ నిర్మాణాలు సైతం కూలిపోతాయి. కార్చిచ్చులకు కారణమవుతాయి. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అమెరికాలో ఇటువంటి గాలులు అధికం. వీటిని టోర్నడో అంటారు. అయితే అటువంటి గాలులే తాజాగా అమరావతిలో వీస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దీనిపై ఎక్కువగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
Also Read: పిల్లలను కనండి.. బాబు కోరిక వైరల్!
* ఈ నెల చివర్లో పునర్నిర్మాణ పనులు..
అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 4285 కోట్ల రూపాయలను విడుదల చేసింది. బడ్జెట్లో కేటాయించిన మాదిరిగా.. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఈ నిధులను సర్దుబాటు చేసింది. ఈనెల చివర్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అమరావతి రాజధానిలో అమెరికా టోర్నడోలు అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది.
* తెరపైకి మూడు రాజధానులు
అమరావతి రాజధానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) వ్యతిరేకం. గత ఐదేళ్లలో అమరావతి రాజధానిని చిదిమే యాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. తెరపైకి మూడు రాజధానుల అంశాన్ని తెచ్చింది. కానీ దానిని కూడా పూర్తి చేయలేక పోయింది. న్యాయ అవరోధాలు దాటలేక చేతులెత్తేసింది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అప్పట్లో కూడా అమరావతి రాజధాని కి పనికి రాదని.. ఇది ముంపు ప్రాంతమని.. కృష్ణ నదిలో ముంపు వస్తే అమరావతికి ప్రమాదమని లేనిపోని ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాలో డోర్నడోలు మాదిరిగా ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పేందుకు ఇలా కొత్త ప్రచారానికి దిగుతున్నారు.
* ప్రపంచ బ్యాంకుకు అభ్యంతరాలు..
వాస్తవానికి ప్రపంచ బ్యాంకుకు( World Bank) సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ముందుకు రాగా ఆకాశరామన్న ఉత్తరాలు వెళ్లాయి. తప్పుడు మెయిల్స్ కూడా చేశారు. అమరావతి అనేది ముంపు ప్రాంతమని చెప్పుకొచ్చారు. అయినా సరే స్వయంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతుండగా.. ఈ తరహా ప్రచారానికి దిగడం ఆందోళన కలిగిస్తోంది.
Hey Admin,
జాగర్త పైపులు ఎగురిపోతాయేమో https://t.co/58R0ZaJAhw pic.twitter.com/AqKIwgd9sG
— YSRCP Analytics (@ysrcpanalytics) April 7, 2025