Amaravati: హైదరాబాద్ రియల్టర్లకి బాబు దెబ్బ

2014లో రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అమరావతి రాజధాని ప్రకటన జరిగింది.

Written By: Dharma, Updated On : June 16, 2024 11:39 am

Amaravati

Follow us on

Amaravati: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వస్తూ వస్తూ అమరావతికి ఊపిరిలు ఊదింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. మొత్తం విద్యుత్ కాంతులతో అమరావతిని మెరిపించారు.అమరావతి ఊపిరి పీల్చుకో మీ బాబు వచ్చాడు అంటూ సంకేతాలు పంపించారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులతో పాటు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారిలో కొత్త ఆశలు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఆశలు వదులుకొని.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారంతా ఇప్పుడు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు.

2014లో రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అమరావతి రాజధాని ప్రకటన జరిగింది. రైతుల స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములను ఇచ్చారు. అదే సమయంలో హైదరాబాదులో స్థిరపడిన ఏపీ వ్యాపారులు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. అయితే నిధుల లేమి, అనుమతుల ప్రక్రియ, న్యాయస్థానాల కేసులను అధిగమించి అమరావతి నిర్మాణాల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంతలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారం వైసీపీకి చిక్కింది. దీంతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అప్పటినుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిలిచిపోయింది. ఇక్కడకు వచ్చిన రియల్టర్లు హైదరాబాద్ వెళ్ళిపోవడం ప్రారంభించారు.

ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమికి ఐదేళ్లు ఛాన్స్ఉండడం, కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అంది అవకాశం ఉండడంతో శరవేగంగా నిర్మాణాలు పూర్తయ్య చాన్స్ కనిపిస్తోంది. మరోవైపు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు సైతం ఎగబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ఉన్న రియల్టర్లు ఇప్పుడు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు. గతంలో భూములు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు చదును చేయడం ప్రారంభించారు. కొందరు నిర్మాణాలకు సైతం ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి అమరావతిలో పెట్టుబడి పెట్టిన వారే హైదరాబాదులో రియాల్టర్లుగా ఉన్నారు. వారంతా ఇప్పుడు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అమరావతికి వస్తున్నారు. దీంతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. అమరావతి రాజధాని ప్రభావం భాగ్యనగరం పై స్పష్టంగా కనిపిస్తోంది.