Amaravati farmers: అమరావతి పై( Amravati capital ) ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల అమరావతి రైతుల నుంచి భిన్న స్వరం వినిపించడం ప్రారంభించింది. ఇప్పటివరకు అమరావతి రైతులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని రకాల సమస్యలపై గళం ఎత్తుతున్నారు రైతులు. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ద్వారా కొన్ని విన్నపాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రధానంగా అమరావతిని కదిలించలేని స్థితిలో చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వచ్చారు. ఆపై ఆర్ 5 జోన్లో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపై ప్రభుత్వ భవనాల విషయంలో కూడా కొన్ని రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలను చూస్తున్న మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తామని చెబుతున్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్..
అమరావతి రాజధాని రైతులు ఏపీ ప్రభుత్వం( AP government) పై సంపూర్ణ నమ్మకం ఉంటూ వస్తున్నారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఏ స్థాయిలో పరిణామాలు జరిగాయో వారికి తెలుసు. అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సైతం అదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారికి కౌలు చెల్లించింది. అయితే ప్రధానంగా రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు. వీలైనంత త్వరగా వాటిని రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్పగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న మంత్రి నారాయణ నిన్ననే ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి.. అమరావతి రైతులకు ఫ్లాట్స్ కేటాయిస్తామని తెలిపారు. దీంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.. వెంకటేశ్వర స్వామి తో అవసరమా శివ జ్యోతి?
వచ్చే నెలలో పార్లమెంట్లో..
మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు( crda officers) కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. అయితే దేశంలో మిగతా రాజధానులకు గెజిట్ ప్రకటించలేదని.. అమరావతికి గెజిట్ ప్రకటించి.. చట్టబద్ధత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రంలో టిడిపి సానుకూల ప్రభుత్వం ఉండడంతో చట్టబద్ధత వీలైనంత త్వరగా కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా అమరావతి రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తానికైతే అమరావతి రైతుల అనుమానాలను నివృత్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే ఈ విషయంలో రాజకీయం చేయాలనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎందుకంటే అమరావతి రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అభిప్రాయం ఉంది. దానిని చెరిపేసుకుని కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.