Janasena Party : జనసేన ప్లీనరీ ( janasena plainery) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పార్టీ సన్నాహాలు కూడా ప్రారంభించింది. సన్నాహక సమావేశాలతో పాటు ప్లీనరీ నిర్వహణకు సంబంధించి స్థల పరిశీలన కూడా చేస్తోంది. అనువైన స్థలం కోసం అన్వేషిస్తోంది. జనసేన ఆవిర్భావం నుంచి ఈ ప్లీనరీలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో( Pithapuram ) నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 12, 13, 14 తేదీల్లో ఈ ప్లీనరీ జరగనుంది. జాతీయస్థాయిలో పవన్ ప్రభావం చూపిస్తుండడం.. ఎన్డీఏ లో కీలక భాగస్వామి కావడంతో.. దేశం నలుమూలల నుంచి జాతీయ నాయకులు( national leaders) తరలివచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో టిడిపి తో పాటు బిజెపితో భాగస్వామ్యం కావడంతో ఆ రెండు పార్టీల నాయకులు సైతం తరలివచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు( Chandrababu) తో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. మూడు పార్టీల శ్రేణులు సైతం ఈ ప్లీనరీకి తరలివచ్చే అవకాశం ఉంది. అందుకే లక్షలాదిమంది జనాభాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
* నాయకుల ప్రత్యేక వ్యూహం
కాకినాడ జిల్లా( Kakinada district) జనసేన నాయకులు ప్లీనరీ ఏర్పాటుపై ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రస్థాయి నేతలు సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, గొల్లప్రోలు బైపాస్ రోడ్డు, పిఠాపురం పట్టణ శివారులో పవన్( Pawan) కొనుగోలు చేసిన లేఅవుట్ స్థలాలతో పాటు చిత్రాల సమీపంలోని ఎస్బి వెంచర్స్ లేఅవుట్ స్థలంలో సైతం ప్లీనరీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ స్థల ఎంపిక పూర్తవుతుందని.. సభకు లక్ష మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెండు మూడు స్థలాలను ఎంపిక చేసి పవన్ దృష్టికి తీసుకువెళ్తారని.. ఆయన అభిప్రాయం మేరకు తుది ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
* ఈసారి ప్రత్యేకం
అయితే ఇప్పటివరకు జరిగిన ప్లీనరీలు వేరు.. ఇప్పుడు జరుగుతోంది వేరు. ఈ ఎన్నికల్లో జనసేన( janasena ) సంపూర్ణ విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో సైతం భాగస్వామ్యంగా ఉంది. జాతీయ స్థాయిలో సైతం పవన్ తన పరపతిని పెంచుకున్నారు. ఈ క్రమంలో జనసేన ప్లీనరీకి జాతీయ స్థాయి నాయకులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది. అటు అధికార పార్టీగా ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అందుకే మార్చిలో ఉభయగోదావరి జిల్లాలు కళకళలాడనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రెట్టింపు ఉత్సాహంతో జనసేన( janasena ) నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.