Alekya Chitti pickles
Alekya Chitti pickles : ఇక నేటి స్మార్ట్ కాలంలో ఒక బిజినెస్ జరపాలంటే ముందుగా మనకు వాక్ శుద్ధి ఉండాలి. ఆ తర్వాత ఆహార శుద్ధి ఉండాలి. ఆహారశుద్ధి ఉన్నంత మాత్రాన.. వాక్ శుద్ధి లేకపోతే తేడా కొట్టేస్తుంది. అందువల్లే కస్టమర్లను దేవుళ్ళుగా చూడాలి. వారికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. వారి మన్నన పొందాలి. అప్పుడే మన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది.. అలా కాదు కూడదు అనుకుంటే మొత్తానికే తేడా కొట్టేస్తుంది.. ఏ వ్యాపారంలోనైనా ప్రధాన సూత్రం కస్టమర్ ను గౌరవించడమే. ఒకవేళ కస్టమర్ అడ్డగోలుగా మాట్లాడితే ముందుగా సముదాయించే ప్రయత్నం చేయాలి. అప్పటికి అతడు తగ్గకపోతే మనము అందుకోవాలి. అంటే తప్ప ముందుగానే మనం మొదలు పెడితే కస్టమర్ కు ఎక్కడో కాలుతుంది. ఆ తర్వాత దుకాణం సర్దుకోవాల్సి వస్తుంది.. ఇప్పుడు ఈ పరిస్థితి అలేఖ్య చిట్టికి అవగతం అయింది.. ఇంతకీ ఎవరు ఈమె అంటారా.. ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పికిల్స్ ఓనర్.. ఈమెది రాజమండ్రి. ఆ నగరం కేంద్రంగానే పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టింది.. యువతి.. అందులోనూ వాక్చాతుర్యం బాగుండడంతో పికిల్స్ వ్యాపారం ప్రారంభించిన కొంతకాలానికే ఫేమస్ అయిపోయింది. మార్కెట్లో తన పికిల్స్ తానే ప్రమోట్ చేసుకుంది. మార్కెట్లో విజయవంతమైంది. అయితే ఇలాంటి మహిళలను కచ్చితంగా అభినందించాలి. ఇక అలేఖ్య చిట్టి తయారుచేసే పికిల్స్ కు విపరీతమైన రేటు ఉంటుందని మార్కెట్లో టాక్. అయితే క్వాలిటీ కొనసాగిస్తున్నాం కాబట్టి రేట్లు కూడా అలానే ఉంటాయని అలేఖ్య సమర్ధించుకుంది. అయితే ఇటీవల ఓ వినియోగదారుడుకి ఆమెకు పంపిన వాయిస్ నోట్ అత్యంత దారుణంగా ఉంది. దీంతో నెట్టింట ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Also Read : కొత్త ఫుడ్ డెలివరీ సంస్థ వచ్చింది.. స్విగ్గి, జొమాటోకు తీవ్ర పోటీ తప్పదా?
దారుణంగా ఉంది భాష
అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఒక వాట్సాప్ బిజినెస్ ఖాతా ఉంది. అందులో ఆర్డర్ పెడితే కస్టమర్ల లొకేషన్ వద్దకు డెలివరీ ఇస్తారు. అయితే ఒక కస్టమర్ ఇటీవల వాట్సప్ అకౌంట్లో పికిల్స్ నేను చూసి.. ధరలు ఈ స్థాయిలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించాడు. దీంతో అవతల వైపు నుంచి అడ్డగోలుగా బూతులు తిడుతూ అత్యంత దారుణమైన ఫిమేల్ వాయిస్ మెసేజ్ అతడికి వచ్చింది. ఆ కస్టమర్ ధరలు ఎక్కువ ఉన్నాయని అడిగితే.. ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్పాలి. అంతకి ఇష్టం లేకపోతే అతడిని బ్లాక్ లో పెట్టాలి. కానీ అడ్డగోలుగా విమర్శించడం దేనికి.. అయితే అలేఖ్య చిట్టి ఆ బూతుల మెసేజ్ పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. దీంతో పరిస్థితి ఒకసారిగా తారు మారయింది. ఫలితంగా అలేఖ్య చిట్టి దుకాణం కొద్ది రోజుల వరకు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శలు తీవ్రంగా రావడంతో అలేఖ్య చిట్టి వాట్సప్ అకౌంట్ ను డిలీట్ చేసింది..ఇన్ స్టా లో కూడా కనిపించడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు.. అంటే నెట్టింట వచ్చిన విమర్శల ధాటికి అలేఖ్య చిట్టి సైలెంట్ అయిపోయిందని తెలుస్తోంది.
Also Read : రెగ్యులర్ గా ఈ ఆహార పదార్థాలు తింటే గుండెపోటు ను నివారించవచ్చు.. అవేంటో తెలుసా?