https://oktelugu.com/

WhatsApp : వాట్సాప్‌లో వికృత చేష్టలకు చెక్‌.. 97 లక్షల ఖాతాలపై నిషేధం!

WhatsApp : సోషల్‌ మీడియా(Social Media)తో మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతోంది. కొన్ని యాప్స్‌(aaps) అయితే మోసాల కోసమే పనిచేస్తున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి యాప్స్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిషేధం విధిస్తోంది. తాజాగా వాట్సాప్‌ కూడా వికృత చేష్టలకు చెక్‌ పెట్టేలా నిర్ణయం తీసుకుంది.

Written By: , Updated On : April 3, 2025 / 12:34 PM IST
WhatsApp

WhatsApp

Follow us on

WhatsApp : వాట్సాప్‌(WhatsApp) తన ప్లాట్‌ఫామ్‌పై నిబంధనలను ఉల్లంఘించే వినియోగదారులపై కఠిన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 97 లక్షల వాట్సాప్‌ ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ ప్రకటించింది. వీటిలో 14 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదు రాకముందే స్వీయ–నియంత్రణ చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను గుర్తించడానికి కత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను వాట్సాప్‌ వినియోగించింది. ‘వినియోగదారుల భద్రత మా మొదటి ప్రాధాన్యత‘ అని కంపెనీ స్పష్టం చేసింది. స్పామ్‌(Spam) సందేశాలు పంపడం, నకిలీ ఖాతాల సృష్టి, థర్డ్‌ పార్టీ యాప్‌ల వాడకం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి కారణాలతో ఈ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది.

Also Read : అసలేంటి జిబ్లీ స్టైల్.. ఎందుకు సోషల్ మీడియా దీంతో నిండిపోతోంది?

స్పామ్‌ కార్యకలాపాలు..
వాట్సాప్‌లో వికృత చేష్టలు, స్పామ్‌ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఈ నేపథ్యంలో, ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా ఉంచేందుకు కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అఐ సాంకేతికత ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి, ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా చర్యలు తీసుకోవడం ద్వారా వాట్సాప్‌ తన స్వీయ–పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచింది. 14 లక్షల ఖాతాలను ప్రాక్టివ్‌గా బ్యాన్‌ చేయడం దీనికి నిదర్శనం. ఈ చర్యలు వినియోగదారులకు సురక్షితమైన అనుభవాన్ని అందించడంతో పాటు, డిజిటల్‌ వేదికలపై తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అంతర్గత విశ్లేషణ..
వాట్సాప్‌ నిషేధ చర్యలు కేవలం ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే కాకుండా, వారి అంతర్గత విశ్లేషణల(Internal Assesment) ద్వారా కూడా జరుగుతున్నాయి. స్పామ్‌ మెసేజ్‌లు పంపే ఖాతాలు, నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించే వినియోగదారులు, అనధికార థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించే వారిపై కంపెనీ కన్నెసింది. అలాగే, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఖాతాలను కూడా గుర్తించి నిషేధిస్తోంది. ఈ చర్యలు వాట్సాప్‌ను విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌(Communication) వేదికగా నిలబెట్టడంలో సహాయపడతాయని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.

వాట్సాప్‌ వార్నింగ్‌
ఈ నిషేధాలు వాట్సాప్‌ వినియోగదారులకు ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. నిబంధనలను ఉల్లంఘించే కార్యకలాపాలకు పాల్పడితే ఖాతాలు శాశ్వతంగా బ్లాక్‌ అయ్యే ప్రమాదం ఉంది. భారత్‌లో వాట్సాప్‌ అత్యధికంగా వినియోగించే మెసేజింగ్‌ యాప్‌ కావడంతో, ఈ చర్యలు ఇక్కడి వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతాయి. అఐ ఆధారిత విశ్లేషణలతో వాట్సాప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం నుంచి కాపాడుతూ, యూజర్లకు సురక్షితమైన డిజిటల్‌ అనుభవాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది.

Also Read : వాట్సాప్ వెబ్ ను వాడుతున్నారా?