Air taxis without pilot: అవసరం అనేది ఎంతటి దూరమైనా తీసుకెళ్తుంది. ఎంతటి ఆవిష్కరణనైనా రూపొందించేలా చేస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఊహించిన విధంగా ఆవిష్కరణలను తెరపైకి తీసుకొస్తోంది. అలాంటి ఆవిష్కరణే డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ.
వాస్తవానికి విమానాన్ని కనిపెట్టిన తొలి రోజుల్లో ఎవరూ కూడా ఈ స్థాయిలో ఏవియేషన్ రంగం డెవలప్ అవుతుందని ఊహించలేదు. అయితే ప్రపంచీకరణ తర్వాత ఒక్కసారిగా విమాన యాన రంగం విపరీతమైన అభివృద్ధిని సొంతం చేసుకుంది. ఈ రంగంలో పెద్ద పెద్ద సంస్థలు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడంతో ఒక్కసారిగా ఈ రంగం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు విమానం పెద్ద పెద్ద శ్రీమంతులకే పరిమితమయ్యేది. పెద్దపెద్ద నగరాలలోనే విమానాశ్రయాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒక మధ్యస్థ పట్టణాలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి. విమానయానం అన్ని రంగాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అదే కాదు సొంతంగా విమానాలు ఉన్న వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. విమానాలు నడవడానికి భారీగా ఇంధనం అవసరం పడుతుంది. మ్యాన్ పవర్ కూడా అధికంగా కావాల్సి వస్తుంది.. భవిష్యత్తు కాలంలో చిన్న చిన్న దూరాలకు కూడా ఎయిర్ టాక్సీలు వినియోగించే అవకాశం ఉంది. పైగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సరుకులు, ఔషధాలు, మనుషులను పంపించడానికి ఎయిర్ ట్యాక్సీలను రూపొందిస్తున్నారు. ఇటీవల అబుదాబిలో డ్రైవర్ లేకుండానే ఎలక్ట్రిక్ ఎయిర్ ట్రాక్సీ ఫస్ట్ ట్రయల్ రన్ పూర్తయింది.
వచ్చే ఏడాదిలో డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అమెరికా దేశానికి చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సంస్థ ఆర్చర్ ఏవియేషన్ వీటిని తయారు చేసింది. ఆల్ బతిన్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో హై టెంపరేచర్, తేమ, ధూళి మధ్య డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ని ప్రయోగించారు. ఎయిర్ టాక్సీ విజయవంతంగా ఈ ప్రతికూల పరిస్థితులలో ప్రయాణించింది. అయితే వీటిల్లో సామాన్య ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుందని.. చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
“విమానయాన రంగం భవిష్యత్ కాలంలో చాలా మార్పులకు గురవుతుంది. విమానాలు నడవాలంటే ఇంధనం కావాలి. అయితే స్వల్పదూరాలకు విమానాలు నడిపే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ లే గత్యంతరమవుతాయి. అందువల్లే వీటిని రూపొందించారు. ఇవి స్వల్పదూరాలకు సులభంగా వెళ్తాయి. మనుషులను మాత్రమే కాదు.. సరుకులను.. ఇతర వస్తువులను రవాణా చేస్తాయి. వీటి అవసరం భవిష్యత్తు కాలంలో మరింత పెరుగుతుంది. అందువల్ల వీటి వినియోగానికి ఇప్పుడే అడుగుపడింది. వచ్చే ఏడాది ఇవి ఆకాశంలో పరుగులు పెడతాయని” అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
The UAE has conducted the region’s FIRST SUCCESSFUL AIR TAXI test flight. pic.twitter.com/4oqS3UETvS
— Kim Nkunja (@Andie1L) July 8, 2025