New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫుల్ క్లారిటీ వచ్చింది. జిల్లాల పునర్విభజన కసరత్తు పూర్తి చేసి ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ రెండు కొత్త జిల్లాలతో కలిపి 28 జిల్లాలు అవుతాయి. కొన్ని జిల్లాల్లో మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. నియోజకవర్గాలతో పాటు మండలాలలో మార్పులు సంతరించుకున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటయింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేశారు.
* రెవెన్యూ డివిజన్లలో మండలాల మార్పు కూడా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో నందిగాం మండలం పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్ కు మారింది. అలాగే సామర్లకోట మండలం కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ కు చేరింది. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మార్పు జరిగింది. పెనుగొండ కాస్త వాసవి పెనుగొండ గా మారింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ తో రెవెన్యూ డివిజన్ ఏర్పాటయింది.
* ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సరిహద్దు రాళ్లు, బోర్డులు కూడా మారబోతున్నాయి. అధికారిక రికార్డుల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వాటికి అనుగుణంగా ప్రజలు తమ కార్యకలాపాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.