Revanth Reddy : కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ. స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం మాట్లాడతారు. ఎవరిపైన అయినా విమర్శలు చేస్తారు. సొంత పార్టీలోనే గ్రూపులు కడతారు. కుంపట్లు పెడతారు. ఇక పదవులు విషయంలో అయితే బల ప్రదర్శనకు కూడా దిగుతారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. 12 మందితో సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్‌లో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో.. కేబినెట్ విస్తరణ కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అధిష్టానంతో టచ్‌లో కూడా ఉన్నారు. కొందరు తమకు అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేబినెట్ విస్తరణ సీఎం రేవంత్‌రెడ్డికి అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఇప్పటికే పథకాల అమలుకు నిధులు లేక, ఇబ్బంది పడుతున్నారు. ఈతరుణంలో పాలనకు ఏడాది కావస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మరోమారు చర్చ జరగుతోంది.
ఆశావహుల నిరీక్షణ..
తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమకు కచ్చితంగా పదవి దక్కుతుందని రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నరు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఎమ్మెల్సీలు ఆశ పెట్టుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోచేరిన ఎమ్మేల్యేలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌నేతలు ఇప్పటికే సీఎంతోపాటు అధిష్టానంతోనూ మంతనాలు జరుపుతున్నారు. ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఖాళీ ఉంటేనే..
ఏ సీఎంకు అయినా కొన్ని మంత్రి పదవులు ఖాళీ ఉంటేనే మంచిదని ఆలోచిస్తారు. ఇలా ఉంటేనే నేతలు తమ మాటలు వింటారని అనుకుంటారు. వింటారు కూడా అందుకే చాలా మంది సీఎంలు పదవులు భర్తీ చేయకుండా ఉంచుతారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అందుకే ఏడాదిపాటు ఖాళీగా ఉంచారు. కానీ, ఇప్పుడు భర్తీ చేయక తప్పని పరిస్థితినెలకొంది. అన్ని ఎన్నికలు ముగిశాయి. పాలన ఏడాదైంది. ఏడాది కాలంగా 11 మంది మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈతరుణంలో నిరీక్షిస్తున్నవారిలో అసహనం పెరుగుతోంది. దీంతో అధిష్టానం కూడా మంత్రి పదవుల విస్తరణకు పావులు కదుపుతోంది.
మంత్రి పదవి రాకుంటే..
ఇక మంత్రి పదవి ఆశిస్తున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ పదవులు ఆరే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ సంతృప్తి పర్చడం సీఎం రేవంత్‌రెడ్డికి సాధ్యం కాదు. అందుకే ఆయన కూడా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మరోవైపు మంత్రి పదవి రాకపోయినా.. రేసులో ఉంటే.. ఇతర పదువులు వస్తాయని కొందరు నేతలు భావిసుతన్నారు. ప్రస్తుతం పార్టీ పదవులతోపాటు కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఆశిస్తున్నవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు.
భౌగోలిక, సామాజిక సమస్య,.,
ఇక మంత్రివర్గ విస్తరణకు మరో రెండు సమస్యలు రేవంత్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. భౌగోళికంగా పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవలేదు. ఇక్కడ ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఎమ్మెల్సీకి ఇవ్వాలా.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఇవ్వాలా అన్నది సమస్య. ఇక సామాజికంగా కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సిన పని ఉంది. దీంతో సామాజిక కూర్పు అంత ఈజీ కాదు. పోటీ నేపథ్యంలో ఎలా సామాజిక సమీకరణ చేస్తార్న ప్రశ్న తలెత్తుతోంది.