Posani Krishna Murali: హెరిటేజ్ ఈ బాబుది కాదా?పోసాని సంచలన కామెంట్స్

పోసాని కృష్ణమురళి వైసీపీలో యాక్టివ్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సైతం జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వైసిపి అధికారంలోకి రావడంతో కృష్ణ మురళికి గుర్తింపు లభించింది.

Written By: Dharma, Updated On : February 21, 2024 10:26 am
Follow us on

Posani Krishna Murali: హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదా? ఆయన బలవంతంగా గుంజుకున్నారా? హైజాక్ చేశారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పోసాని కృష్ణ మురళి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తన ఆరోపణలపై నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రస్తుతం పోసాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.

పోసాని కృష్ణమురళి వైసీపీలో యాక్టివ్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సైతం జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వైసిపి అధికారంలోకి రావడంతో కృష్ణ మురళికి గుర్తింపు లభించింది. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకారంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి వరించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పోసాని దూకుడు పెంచారు. మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారింది. ఒకానొక దశలో పవన్ అభిమానుల పేరిట పోసాని ఇంటి పై దాడి జరిగింది. అప్పటినుంచి పోసాని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబుతో పాటు పవన్ లను టార్గెట్ చేసుకున్నారు.

తాజాగా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిడిపికి ఓట్లు వేయమని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. అది వ్యభిచారంతో సమానమని కామెంట్ చేశారు. ఇది కాపులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ పవన్ చేసిన ఆరోపణల పై కూడా పోసాని స్పందించారు. అవి నిరాధార ఆరోపణలుగా కొట్టి పారేశారు. గ్రామాల్లో ప్రశాంత జీవితంతో గడుపుతున్నారని.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాపులను మోసగించినందున.. వారి కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని పోసాని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పై సైతం పోసాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు రద్దు చేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. టిడిపిలో మహిళా నేతలకు గౌరవం లేదని.. జయప్రద లాంటి మహిళకు ఎలా అవమానించారో అందరికీ తెలుసు అన్నారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుది అని.. ఆయన వద్ద నుంచి చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారని… ఇది కొద్దిమందిలో నాలాంటి వ్యక్తులకు తెలుసునని పోసాని చెప్పుకొచ్చారు. ఈ విషయం అబద్ధమని చెబితే నార్కో ఎనాలసిస్ టెస్ట్ కు చంద్రబాబు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.