ABN Venkatakrishna: పాత్రికేయులు న్యూట్రల్ గా ఉండాలి. ఏ విషయమైనా సరే న్యూట్రల్ గానే చెప్పాలి. పార్టీలకు ప్రభావితం కాకూడదు. రాజకీయ నాయకులకు బాకాలు ఊదకూడదు. ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తేనే పాత్రికేయం నాలుగు కాలాలపాటు బాగుంటుంది. ఇందులో పని చేసేవారు గొప్పగా వెలుగొందుతారు. వెనుకటి కాలంలో ఇలాంటి పాత్రికేయాన్ని కొనసాగించడం వల్లే చాలామంది పాత్రికేయులు గొప్పవాళ్ళు అయ్యారు. నేటికీ ఆదర్శనీయమైన వ్యక్తులుగా ప్రశంసలు పొందుతున్నారు. అలాంటి వ్యక్తులు నేటి కాలంలో అంజనం వేసి వెతికి చూసినా సరే కనిపించడం లేదు.
మీడియా అనేది నేటి కాలంలో భజనకు పర్యాయపదంగా మారిపోయింది. వ్యక్తి పూజకు నానార్థంగా రూపాంతరం చెందింది. మొదట్లో పరోక్షంగా మాత్రమే మీడియా ఈ పని చేసేది. ఇటీవల కాలంలో ప్రత్యక్షంగానే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. అలాంటి మీడియా సంస్థల్లో పనిచేసే వారంతా కూడా పాత్రికేయుల కంటే.. పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. పార్టీ కార్యకర్తలను మించి పనిచేస్తున్నారు. జనాలు ఏమనుకుంటారు.. ఎలాంటి విమర్శలు చేస్తారు అనే విషయాలను పక్కనపెట్టి భజన చేయడంలో భట్రాజులను మించిపోయారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మీడియాలో పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందని నమ్మకం లేదు.
తెలుగులో మీడియా అనేది భజన వ్యవస్థగా మారిపోయి చాలా రోజులైంది. బాకాలు ఊదుకుంటూ రాజకీయ నాయకుల సేవలో తరించడాన్ని మీడియా గట్టిగానే ఒంట పట్టించుకుంది. విలువలకు పాతర వేసి.. వలువలను పూర్తిగా వదిలేసి నగ్నంగా నర్తిస్తోంది. ఇది తప్పు.. ఇలా చేయడం సమాజానికి ముప్పు అని చెప్పేవారు లేకుండా పోయారు. దీంతో మీడియాను నడిపేవారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఓ ఛానల్ లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఓ వ్యవహారం పై డిబేట్ నడిచింది. ఈ డిబేట్ నిర్వహించే వ్యక్తి న్యూట్రల్ వ్యక్తిత్వాన్ని అనుసరించాల్సింది పోయి.. పార్టీకి భజన చేయడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి బాధపడుతున్నారని.. ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారని.. దీనివల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. అది పార్టీకి.. ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వాపోయాడు. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎందుకు గీత దాటుతున్నారు? అలాంటి వ్యక్తులకు టికెట్లు ఎందుకు ఇచ్చారు? వారితో ఎన్నికల్లో ఆ స్థాయిలో ఎందుకు ఖర్చు పెట్టించారు? ఖర్చుపెట్టినప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి కదా.. ఆ లోటును పూడ్చుకోవాలి కదా.. ఆ విషయాలను ఆ పాత్రికేయుడు పూర్తిగా మర్చిపోయారు.. పైగా ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారంటూ మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. మీడియా సంస్థలను మేనేజ్ చేయాలి. ఇతర వ్యక్తులను శాంతపరచాలి.. వీటన్నింటికి డబ్బులు కావాలి. ఆ డబ్బులను ఆర్జించాలంటే ఎమ్మెల్యేలు గీత దాటాలి. అలా గీత దాటకపోతే డబ్బులు రావు. డబ్బులు ఇవ్వకపోతే మీడియా సంస్థలు ఊరుకోవు. డబ్బులు తీసుకుంటూనే.. ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంగా కథనాలు రాయడం.. కథనాలను ప్రసారం చేయడం ఇటువంటి మీడియా సంస్థలకే చెల్లింది. పైగా సీతమ్మ శోకాలు పెడుతూ ఆర్తనాదాలు వినిపించడం మీడియా సంస్థలకు అలవాటుగా మారింది.
బాధకృష్ణ భాధలు!!
ఎమ్మెల్యే లు గీత దాటటం వల్ల ప్రభుత్వం, ప్రజల్లో పలచన అవుతుంది !!
కూటమి పార్టీల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి !! pic.twitter.com/5NLWN3bXtU— The Samosa Times (@Samotimes2026) October 5, 2025