ABN Radhakrishna : పత్రికాధిపతులకు రాజకీయ రంగులు ఉంటాయి. రాజకీయ వాసనలు ఉంటాయి. రాజకీయ నాయకులతో అంటకాగే సందర్భాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు డప్పు కొట్టి.. ప్రచారం చేసే అవసరాలు కూడా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే పత్రిక నిర్వహణ అనేది కూడా ఒక వ్యాపారమే. అందులో పని చేస్తున్న వారు కూడా ఉద్యోగులే. వారికి కూడా నెలనెలా జీతాలు ఇవ్వాలి. భవిష్య నిధి లాంటి సౌకర్యాలు.. ప్రతి ఏడాది జీతాలలో పెంపుదల వంటి సౌలభ్యాలు కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే యాజమాన్యాలు న్యూట్రల్ గా ఉండాలి. కానీ యాజమాన్యాలు అలా ఎందుకు ఉంటాయి? అలా ఉంటే అవి యాజమాన్యాలు ఎందుకు అవుతాయి? న్యూట్రల్ గా ఉంటే ఊహించినంత గొప్పగా డబ్బు సంపాదించే అవకాశం ఉండదు. పైగా విలువలు, వంకాయలను నమ్ముకుంటే నడిచే రోజులు కావు ఇవి. అందుకే యాజమాన్యాలు రాజకీయ రంగులు అద్దుకుంటాయి. పార్టీ కార్యకర్తలకు మించి నినాదాలు చేస్తుంటాయి. ఇందులో ఒక్కో పత్రిక యజమానిది..ఒక్కో తీరు.
Also Read : ఏపీ చరిత్రలోనే ఈరోజు శాశ్వతం.. ప్రధానికి ఆ విషయంలో బాబు ఫుల్ సపోర్ట్
కరెంటు కొనేశారు
తెలుగు నాట టిడిపి అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలలో ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. ఇది మేం చేస్తున్న ఆరోపణ కాదు. రెండు శాసనసభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికలు అని సంభోదించాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా పేరుతోనే ప్రస్తావించాడు. సో సో ఇందులో ముసుగులో గుద్దులాట అనేది లేదు. ఓపెన్ గానే ఇటీవల ఎన్నికల్లో టిడిపికి ఆంధ్రజ్యోతి సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని సర్ఫ్ ఎక్సెల్ తో ఉతుకుడు ఉతికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు కి టిటిడి చైర్మన్ పదవి లభించింది.ఇప్పుడు ఈ జాబితాలో కాస్త ఆలస్యంగా నైనా ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ చేరిపోయారు. అలాగని ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. కాకపోతే ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీకి నజరానా లభించింది. ఏపీ ప్రభుత్వం యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఏపీ సిపిడిసిఎల్, యాక్టివ్ పవర్ సమర్పించిన పిటిషన్లకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పచ్చ జెండా ఊపింది. రాధాకృష్ణకు ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్ పై 1.54 మెగా వాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం ఉంది. దీని నుంచి 15 సంవత్సరాలపాటు విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025 జూన్ 1 నుంచి ఏపీ సీపీడీసీఎల్ యూనిట్ కు 2.50 రూపాయలు చెల్లించి విద్యుత్ తీసుకుంటుంది. ఇక ఈ టారీఫ్ విషయంలో ముందస్తు ప్రణాళిక అనేది లేదు. కేవలం అవసరం కోసం మాత్రమే ప్రత్యేకంగా ఇస్తోంది..