Deputy CM Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో కూటమి నేతలపై న్యాయపోరాటం చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం పై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. తన సినిమాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నిన్ననే వాదనలు జరిగాయి. అయితే గతంలోనే దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేశారు ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. అయితే అప్పట్లోనే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయిందని.. ప్రజా ప్రతినిధులు సినిమాల్లో నటించవచ్చని తీర్పు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టులో సమర్పించలేదని ఏజీ చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు గాను పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్టీఆర్ కేసు తీర్పు అధ్యయనం చేసేందుకు సమయం కావాలని కోరడంతో కోర్టు విచారణను సెప్టెంబర్ ఒకటికి వాయిదా వేసింది.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
* స్టార్ డం చూసి భయపడుతున్న వైసిపి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) విపరీతమైన ప్రేక్షక అభిమానం ఉన్న హీరో. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే ఆయన స్టార్ డం చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతూ వస్తోంది. ఇటీవల ఆయన సినిమాల విషయంలో నెగిటివ్ ప్రచారానికి కూడా దిగిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తమకు అనుకూలమైన వ్యక్తులతో పవన్ సినిమాల్లో నటించడం పై కోర్టులో పిటిషన్ వేసింది. పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో నటించకుండా ఆపాలని.. హరిహర వీరమల్లు సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆగస్టు 19న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు అయింది. కోర్టు విచారణకు అంగీకరించింది. అయితే నిన్నటికి కేసు విచారణను వాయిదా వేసింది. నిన్ననే విచారణ చేపట్టిన న్యాయస్థానం మరోసారి ఈ కేసును వారం రోజులపాటు వాయిదా వేయడం విశేషం.
* ఎన్టీఆర్ విషయంలో తీర్పుతో..
నందమూరి తారక రామారావు( NTR) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ చాలా చిత్రాల్లో నటించారు. అప్పట్లో దీనిపై రాజకీయ ప్రత్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పట్లో ఎన్టీఆర్కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దానినే గుర్తు చేశారు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్. తాజాగా టికెట్ల ధర పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం లేదని.. అందుకు తగ్గ ఆధారాలు కూడా చూపించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు న్యాయమూర్తి ముందు. ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించి పవన్ కళ్యాణ్ విషయంలో తీర్పు ఇవ్వాలని ఏజీ వాదనలు వినిపించారు. అయితే ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక ప్రతి వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణను సెప్టెంబర్ 15 కు వాయిదా వేసింది కోర్టు.